Breaking News

బంగారు తెలంగాణ సాకారం తెరాసతోనే సాద్యం

కామారెడ్డి, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా సాకారం చేయడం తెరాస పార్టీతోనే సాధ్యమని కామరెడ్డి అభ్యర్తి గంప గోవర్ధన్‌ అన్నారు. బుధవారం ఆయన సొంత ఊరు బస్వాపూర్‌ గ్రామంతోపాటు కామరెడ్డి పట్టణంలోని వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాటినే కాకుండా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అలాగే కొనసాగాలంటే తెలంగాణ ప్రగతి పథంలో నడవాలంటే తెరాస తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరముందని చెప్పారు. ప్రజలు తనను గెలిపించి అభివృద్దికి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *