Breaking News

కామరెడ్డి అభివృద్ది చెందింది కాంగ్రెస్‌ హయాంలోనే

కామారెడ్డి, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ది చెందింది తాను కాంగ్రెస్‌నుంచి గెలిచి రెండు సార్లు మంత్రిగా పనిచేసిన హయాంలోనేనని కాంగ్రెస్‌ అభ్యర్తి షబ్బీర్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణంతోపాటు ఉగ్రవాయి గ్రామాల్లో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్‌షోలో జనాన్ని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకాన్ని కల్పించిందని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నపుడు నియోజకవర్గ అభివృద్ది కోసం ఎన్నో పనులు చేశానని, ఇందిరాగాంధీ స్టేడియం, డైరీ టెక్నాలజి, గోదావరి జలాలతోపాటు ఇతర అభివృద్ది పనులు చేశానని వివరించారు. గంప గోవర్దన్‌ ఏం చేశారని నిలదీశారు. తన అనుచరులకే సబ్సిడీ ట్రాక్టర్లు, కాంట్రాక్టులు ఇచ్చి దీన్ని ప్రశ్నించిన మీడియాను, ప్రజలను అణిచివేయాలని చూశాడని ఆరోపించారు. కనీసం రోడ్లు, మురికి కాలువలు, మంచినీరు ఇవ్వలేని వ్యక్తికి ఓట్లు అడిగే హక్కు ఉందా అనిప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *