Breaking News

ఎన్నికల ప్రచారంలో స్వామి పరిపూర్ణనంద

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నేత స్వామి పరిపూర్ణనంద బుధవారం నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌ నగర వీధుల గుండా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణనంద మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి క్రియాశీలకంగా మారుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని, తెలంగాణ ప్రజలు ఇతర పార్టీల మోసాలను గ్రహించాలని కోరారు. లౌకికవాదం పేరుతో హిందూసమాజంపై రాను రాను దాడులు పెరుగుతున్నాయని, దీనిపై ప్రశ్నించిన వారిని హిందూ మతోన్మాదులుగా అభివర్ణిస్తున్నారని, కుహనా లౌకికవాదులకు బుద్దిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, నిజమైన లౌకికవాదం బిజెపిలో ఉందన్నారు. ఇందుకు నిదర్శనం ప్రధాని మోడి పాలనయే నన్నారు. తెలంగాణలో మజ్లిస్‌ ఆగడాలు పెరిగిపోతున్నాయని అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌లు హిందువుల పట్ల ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం భవిష్యత్తులో అనేక మతపరమైన గొడవలకు దారితీస్తుందన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌లో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మినారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని స్వామిజీ కోరారు. రోడ్‌షోలో జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, బస్వా లక్ష్మినర్సయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *