Breaking News

పోలింగ్‌ ఏర్పాట్లు సర్వం పూర్తి

కామారెడ్డి, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ రోజు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అదికారి సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ ఏర్పాట్లలో భాగంగా గురువారం కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను ఆయన సందర్శించి పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌కు సంబందించి 740 పోలింగ్‌ కేంద్రాల్లో 5 లక్షల 78 వేల 050 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మనస్సాక్షిగా ఓటు వేయాలని కోరారు. పోలింగ్‌, రెవెన్యూ సిబ్బంది కలిపి 5 వేల మంది, 165 మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో డిజిటల్‌ సర్వే లైన్స్‌ చేసినట్టు పేర్కొన్నారు. పోలింగ్‌ స్టేషన్లలోఉదయం 6 గంటల నుంచి పోలింగ్‌ ముగిసి సీల్‌ అయ్యేంత వరకు డిజిటల్‌ సర్వేలైన్స్‌ ప్రక్రియ నడుస్తుందన్నారు. కంట్రోల్‌ యూనిట్స్‌ 120 శాతం, బ్యాలెట్‌ యూనిట్స్‌ 21 శాతం, వీవీప్యాట్లు 27 శాతం రిజర్వుతో ఉన్నాయని తెలిపారు. 86 రూట్లు ఉన్నాయని, వీరికి రెండు సెట్లు ఈవిఎంలు అదనంగా ఇచ్చామన్నారు. ఓటర్లు ఓటు వేయడానికి తమ వెంట ఎపిక్‌ కార్డుతో పాటు ఫోటో ఓటరు స్లిప్‌ వెంట తెచ్చుకోవాలని లేనిపక్షంలో ఏవైనా గుర్తింపు కార్డు తీసుకురావచ్చని పేర్కొన్నారు. పోలింగ్‌కు ముందు 48 గంటల నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వివరించారు. పోలింగ్‌కు అందరు సహకరించాలని కోరారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *