Breaking News

మహాత్ముని అడుగుజాడల్లో పయనించినపుడే నిజమైన నివాళులు

రెంజల్‌, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాల నాయకుడు ప్రపంచంలోనే అత్యున్నమైన రాజ్యాంగాన్ని ప్రసాదించిన నాయకుడు భారత రత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో పయనించినపుడే మహాత్మునికి నిజమైన నివాళులు అర్పించినట్లని దళితరత్న అవార్డు గ్రహీత జక్కుల సంతోష్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో అంబేడ్కర్‌ 62వ వర్ధంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ వేడుకలు దళితులు సంతోషంతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌ మాట్లాడుతూ సమాజంలో మనిషిని మనిషిగా గుర్తించి చీకటి లోకంలో జీవిస్తున్న దళిత ప్రజలను వెలుగులోకి తెచ్చి మనిషి స్థాయిని పెంచిన మహనీయుడు అంబేడ్కర్‌ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించిన ఘనత ఆ మహనీయుడిదేనన్నారు. మహిళలకు ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే సమానహక్కులు కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు సిద్ద ప్రభాకర్‌, సైదులు, మదన్‌, పోచయ్య, సాయిలు, కిరణ్‌, రమేశ్‌, పోశెట్టి, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు భూమయ్య, బాలాజీ, సాయిలు తదితరులున్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *