Breaking News

దివ్యాంగుల కొరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు

రెంజల్‌, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దివ్యాంగుల వికలాంగులకు ఎన్నికల సందర్భంగా ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఎపిఎం చిన్నయ్య తెలిపారు. గురువారం మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న 172 మంది దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. వీరికి ఇంటి వద్ద నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు తీసుకెళ్ళే విధంగా సౌకర్యాన్ని డిఆర్‌డిఓ వారి ఆద్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినట్టు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామాల్లోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఐకెపి సిసిలు శ్యామల, భాస్కర్‌, రాజయ్య, కృష్ణ, శివకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *