Breaking News

పోలింగ్‌ ప్రశాంతం

కామారెడ్డి, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన పోలింగ్‌ చెదురు మదురు సంఘటనలు మినహా సజావుగా సాగింది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసుల భద్రత మద్య ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయానికి జుక్కల్‌ 70.58 శాతం, ఎల్లారెడ్డి 80.50 శాతం, కామారెడ్డి 68.09 శాతం మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 73.05 శాతం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ సరళిపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబరు 11న జరగనున్న ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *