Breaking News

బాన్సువాడలో పోచారం ఓటమి ఖాయం

కామారెడ్డి, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముందస్తు ఎన్నికల పేరిట ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన పతనాన్ని తానే కోరుకున్నారని బాన్సువాడలో మంత్రి పోచారంతోపాటు చాలా మంది ఓటమి పాలు కానున్నారని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ జోస్యం చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతో షబ్బీర్‌ అలీ సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల వైపే ప్రజలు మొగ్గుచూపారని, జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేయబోతున్నామని అభిప్రాయపడ్డారు. తెరాస నిరంకుశ పాలనకు, ప్రజాస్వామ్యానికి జరిగిన యుద్దంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో గెలవబోనున్నారని అన్నారు. కార్యక్రమంలో నల్లమడుగు సురేందర్‌, జనార్దన్‌గౌడ్‌, కాసుల బాలరాజు, కత్తెర గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమస్యల పరిష్కారానికి కమీషనర్‌ హామీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *