Breaking News

కౌంటింగ్‌ రోజు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా, ఏకాగ్రతతో పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం జనహిత భవనంలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కౌంటింగ్‌ రోజు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ సిబ్బంది హాజరుకావాలని ఆదేశించారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్‌, 1 రిటర్నింగ్‌ అధికారిని ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ పార్టీకి సంబంధించి ఒక ఏజెంట్‌ చొప్పున 16 మందిని అనుమతిస్తామన్నారు. కౌంటింగ్‌ హాలుకు 54 మంది ఉద్యోగులు పనిచేస్తారని తెలిపారు. కౌంటింగ్‌ అయిన తర్వాత పోలింగ్‌ స్టేషన్ల వారిగా స్లిప్పులను లాటరీ పద్దతిపై ఒక వీవీప్యాట్‌ సీల్‌తీసి ప్రింటెండ్‌ స్లిప్పులు కంపేర్‌ చేస్తామని వివరించారు. అనంతరం కౌంటింగ్‌పై శిక్షణ, స్క్రీన్‌ ప్రజంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, సహాయ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె, నోడల్‌ అధికారులు, శ్రీనివాస్‌, రఘునాథ్‌, నాగేంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టిసి కార్మికుల సమస్యల పరిష్కరానికై శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *