Breaking News
Bus accident

బస్సు ఢీకొని వివాహిత మృతి

నిజామాబాద్‌, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మండలం కాలూర్‌ గ్రామ శివారులో బస్సు ఢీకొని గ్రామానికి చెందిన మారెమ్మ అనే వివాహిత మృతి చెందింది.

నిజామాబాద్‌ నుంచి జన్నేపల్లి వెళుతున్న బస్సు ఏపి 28 జెడ్‌ 1930 డిపో 2, అతివేగంగా వచ్చి మోటారుసైకిల్‌పై వెళుతున్న దంపతులను ఢీకొనడంతో మారెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.

డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కాగా బస్సు డ్రైవర్‌ వేణుగౌడ్‌పై కేసు నమోదుచేసినట్టు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Check Also

పేకాటరాయుళ్ల అరెస్టు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఖలీల్‌వాడిలో ఓ సిటీ స్కానింగ్‌ సెంటర్‌ పై ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *