Daily Archives: February 2, 2019

రెండు బైకులు ఢీ – ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపీట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫకీరాబాద్‌ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మతి చెందగా ఐదుగురు గాయపడినట్లు ఎస్‌.ఐ. వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌.ఐ కథనం ప్రకారం నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని మైలాపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లిగడ్డల సచిన్‌ (27),రాజు, కనేరాజు అనే ముగ్గురు యువకులు నవీపేట్‌ నుంచి బాసరవైపు వెళుతుండగా ఫకీరాబాద్‌ వద్ద ఎదురెదురుగా మోటర్‌సైకిళ్ళు ఢీకొనడంతో సచిన్‌ అక్కడికక్కడే మతి చెందగా ...

Read More »

ఓటరు జాబితాపై ఆదివారం ప్రత్యేక ప్రచారం

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కామారెడ్డి డివిజన్‌లో ఆదివారం ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్టు కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 016 కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిదిలోని 262 పోలింగ్‌ స్టేషన్లలో బూత్‌ లెవల్‌ అధికారులు ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు నమోదు కార్యక్రమం చేపడతారని తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు ...

Read More »

ఎఫ్‌ఎల్‌సి నిర్వహణ కార్యక్రమం పరిశీలన

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఈవిఎం యంత్రాల ఫస్ట్‌లెవల్‌ చెక్‌ నిర్వహణ కార్యక్రమాన్ని శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాములో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, దేవేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Read More »

ఆలయంలో ప్రేమ వివాహం

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, దోమకొండ మండలం గొట్టుముక్కుల గ్రామానికి చెందిన రచనలు శనివారం ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు ప్రేమజంట తెలిపారు. భిక్కనూరు ఎస్‌ఐ తమను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. అందుకే ఆలయంలో వివాహం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

Read More »

కేబుల్‌ టివి ఆపరేటర్ల ఛలో హైదరాబాద్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రాయ్‌ విధి విధానాలకు నిరసనగా కామారెడ్డి పట్టణ కేబుల్‌ టివి ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో శనివారం ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ బారీ ఎత్తున నిర్వహించనున్నట్టు తెలిపారు. అంతకుముందు పట్టణంలో సైతం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి సిటి డిజిటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల రెండ్రోజుల నుంచి కేబుల్‌ టివిలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేబుల్‌ టివి ఆపరేటర్ల యాజమాన్యం ఎలాంటి పరిష్కారం ...

Read More »

శాబ్దిపూర్‌ సర్పంచ్‌కు సన్మానం

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన యాదమ్మ పరశురాములు చేత కామారెడ్డి తహసీల్దార్‌ రాజేందర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతోపాటు ఉప సర్పంచ్‌ చింతల నాగరాజు, వార్డు మెంబర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు పిప్పిరి ఆంజనేయులు, మామిండ్ల అంజయ్య, గోపిగౌడ్‌, వెంకట్‌రావులు నూతన పాలకవర్గాన్ని సత్కరించారు.

Read More »

పనిచేసే ఉద్యోగంలో పరిపక్వత పాటించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనిచేసే ఉద్యోగంలో పరిపక్వత పాటించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నేతృత్వంలో జాబ్‌మేళా నిర్వహించారు. 2572 ఉద్యోగాలకు జాబ్‌మేళా జరిపారు. శ్రీచైతన్య విద్యాసంస్థల క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా లెక్చరర్‌, టీచర్‌, ట్యూటర్‌ పోస్టులకు 98 మందిని ఎంపిక చేశారు. వివిధ కార్పొరేట్‌ కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యోగం చిన్నదా పెద్దదా ఆలోచించకుండా పొందిన ఉద్యోగంలో ...

Read More »

నిర్బంద తనిఖీలు నిర్వహించిన పోలీసులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆద్వర్యంలో శనివారం సాయంత్రం 1వ టౌన్‌ పరిదిలో పోలీసులు, అటవీశాఖ సంయుక్తంగా 1వ టౌన్‌ పరిదిలోని మాలపల్లి కాలనీలో నిర్బంద తనికీలు నిర్వహించారు. నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా 1వ టౌన్‌ పరిధిలో అనుమానితులను ఆరాతీసి క్రిమినల్స్‌ ఎవరైనా షెల్టర్‌ పొందుతున్నారా, పాత నేరస్తుల కదలికలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎలాంటి కాగితాలు, నెంబరు ప్లేట్లు లేని 40 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, ...

Read More »

విద్యార్థికి నగదు అందజేత

రెంజల్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి గ్రామానికి చెందిన విద్యార్తిని ముస్కాన్‌ పర్వీన్‌ 10వ తరగతిలో 8.8 జిపిఎ సాధించినందుకుగాను కందకుర్తి గ్రామ మాజీ సర్పంచ్‌ యాదవరావు విద్యార్థిని ఉన్నత చదువుల కోసం తన వంతు సాయంగా రూ. 5 వేల నగదును శనివారం విద్యార్థినికి అందజేశారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్‌ కలీంబేగ్‌, ఉపసర్పంచ్‌ యోగేశ్‌, గౌస్‌ తదితరులున్నారు.

Read More »

కొలువుదీరిన కొత్త పాలకవర్గం

రెంజల్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌ అభ్యర్తులు, వార్డు సభ్యుల కొత్త పాలక వర్గం కొలువుదీరింది. శనివారం వీరికి గ్రామ పంచాయతీ ప్రత్యేక అదికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు గ్రామస్తులు ఘనంగా సన్మానం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాభివృద్దికి పాటుపడి గ్రామానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అసదుల్లా ...

Read More »

ఎలక్ట్రిసిటి సూపరింటెండెంట్‌ను సన్మానించిన ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

రెంజల్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎలక్ట్రిసిటి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజనీర్‌గా నూతనంగా నియమితులైన సుదర్శనంను ఎంఆర్‌పిఎస్‌ నాయకులు శనివారం నిజామాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌ నాయకులు ఎర్ర రాంచందర్‌, మల్ల సాయిలు, మందారం రాములు తదితరులు పాల్గొన్నారు.

Read More »

బ్యాలెట్‌ కంట్రోల్‌ యూనిట్‌లను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శనివారం నగరంలోని ఎఫ్‌ఎల్‌సి కేంద్రంలో బ్యాలెట్‌ కంట్రోల్‌ యూనిట్‌లను పరిశీలించారు. మొదటి దశ పరిశీలనలో భాగంగా బ్యాలెట్‌ కంట్రోల్‌, వీవీప్యాట్‌లను బిహెచ్‌ఇఎల్‌, ఇసిఎల్‌ కంపెనీలకు చెందిన ఇంజనీర్ల సమక్షంలో పరిశీలించారు. ముందుగా బ్యాలెట్‌ కంట్రోల్‌ యూనిట్లను పరిశీలించిన తర్వాత వీవీప్యాట్‌లు పరిశీలించాలని అధికారులను కలెక్టర్‌ సూచించారు. బాగా పనిచేసే వాటికి స్టిక్కర్లు వేయాలని, పనిచేయని వాటిని ఇంజనీర్లు తిరిగి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అసెంబ్లీ ...

Read More »

ఈనెల 13న నిజామాబాద్‌ రానున్న అమిత్‌షా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 13వ తేదీన నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నట్టు జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ తెలిపారు. శనివారం బస్వాగార్డెన్స్‌లో ఐదు పార్లమెంటు నియోజకవర్గాల క్లస్టర్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న పార్లమెంటు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఐదు పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించడానికి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విచ్చేస్తున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన ...

Read More »