Breaking News

Daily Archives: February 3, 2019

సోమవారం డయల్‌ యువర్‌ సిపి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమం సోమవారం యధావిధిగా కొనసాగుతుందని పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు 08462-228433 నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలు విన్నవించుకోవాలని ఆయన తెలిపారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమీషనర్‌ సూచించారు. ఫోన్‌ చేసే సమయంలో ఎలాంటి శబ్దం లేకుండా సమయ పాలన పాటిస్తు ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు.

Read More »

నిజామాబాద్‌ నగరాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరాన్ని రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అగ్ర నగరంగా తీర్చిదిద్దుతానని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త అన్నారు. ఆదివారం 39వ డివిజన్‌లోని అర్సపల్లి, భగత్‌సింగ్‌ కాలనీలో రూ. 5 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తమపై నమ్మకముంచి తిరిగి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు రుణపడి ఉంటామని, నిజామాబాద్‌లో జరుగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది మౌలిక వసతుల విషయంలో ...

Read More »

ఓటరు నమోదు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో అబీబ్‌నగర్‌లోని కేంబ్రిడ్జి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆదివారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల నెంబర్లు మారినందున నూతన నెంబర్లు పోలింగ్‌ కేంద్రాల గోడలపై రాయాలని, దాంతోపాటు బిఎల్‌వో మారిన యెడల వారి స్థానంలో కొత్తవారి పేర్లు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్‌కు సంబంధించి ల్యాటిట్యుడ్‌, లాంగిట్యుడ్‌ చేయాలని రెవెన్యూ అదికారులకు సూచించారు. అనంతరం ఖిల్లారోడ్డులోని నేషనల్‌ హైస్కూల్‌, గోల్డెన్‌ ...

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టణ అనాథ పిల్లల వసతి గృహాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించారు. తరగతి గదులు పరిశీలించి పిల్లలకు నాణ్యమైన భోజనం మెను ప్రకారం అందించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో ఎలాంటి అపరిశుభ్రతకు చోటివ్వకుండా పిల్లలకు మెరుగైన వసతులు కల్పించాల్సిన బాద్యత వసతి గృహ సిబ్బందిపై ఉందని కలెక్టర్‌ అన్నారు.

Read More »

టిఎన్జీవోస్‌ క్రికెట్‌ పోటీలు ప్రారంభం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాలకు చెందిన టిఎన్జీవోస్‌ క్రికెట్‌ టోర్నిని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు స్థానిక పాలిటెక్నిక్‌ మైదానంలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లా టీఎన్జీవోస్‌ శాఖ రాష్ట్రస్థాయిలోప్రథమ బహుమతి సాధించాలని, గత సంవత్సరం జరిగిన పోటీల్లో రెండవ బహుమతి పొందిందని గుర్తుచేశారు. ఇక్కడ గెలుపొందిన వారు కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు అలుక కిషన్‌, ఉమ్మడి జిల్లాల నాయకులు తదితరులు ...

Read More »

విశ్వం అబాకస్‌, వేదిక్‌ మ్యాథ్స్‌ జిల్లాస్థాయి పోటీలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వం ఎడ్యుటెక్‌ స్కూల్‌ల్యాబ్స్‌ ఆధ్వర్యంలో అబాకస్‌, వేదిక్‌ మ్యాథ్స్‌ జిల్లాస్థాయి పోటీలు స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో ఆదివారం నిర్వహించారు. పోటీలకు జిల్లాలోని 95 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 208 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 30 మంది ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా వీరిని హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేసినట్టు విశ్వం రీజినల్‌ మేనేజర్‌ వినాయక్‌, జోనల్‌ మేనేజర్‌ మారుతి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటి ఇఓ పద్మనాభం, ఏసిఇ ...

Read More »

పోలింగ్‌బూత్‌లను పరిశీలించిన ఆర్డీవో

రెంజల్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లను ఆదివారం బోదన్‌ ఆర్డీవో గోపి పరిశీలించారు. ముందస్తు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌బూత్‌లను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్‌బూత్‌లలో అన్ని సౌకర్యాలు ఉండాలని విఆర్వో సంతోష్‌ను ఆదేశించారు. పోలింగ్‌బూత్‌లో బిఎల్‌వోలు అందుబాటులో లేకపోవడంతో విఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 గంటల వరకు కూడా బిఎల్‌ఓలు అందుబాటులో లేకపోవడం ఏమిటని విఆర్వోను మందలించారు. ఓటరు జాబితాలో తప్పు ఒప్పులను సవరించుకునేందుకు చివరిరోజు కావడంతో బిఎల్‌వోలు అందుబాటులో ...

Read More »

సోమవారం మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి మోబిన్‌ఖాన్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు ఎంపిడివో చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిదులు హాజరు కావాలని ఆయన అన్నారు.

Read More »

సోమవారంతో ముగియనున్న ఓటర్‌ నమోదు

నందిపేట్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల తరువాత ఓటర్ల జాబితాలో తప్పులు సవరించి తప్పులేని ఓటర్ల జాబితా తయారు చేసి పార్లమెంట్‌ ఎన్నికల నాటికి సిద్ధం చేసి ఉంచాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ గత నెల రోజుల నుండి చేపడుతున్న ప్రక్రియ సోమవారం ముగియనుందని నందిపేట్‌ తహసీల్దార్‌ ఎలావెలు పేర్కొన్నారు. ఓటరు నమోదుకు నందిపేట్‌ మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు మండల రెవిన్యూ అధికారులు చేపట్టడంతో ఆదివారం నిర్వహించిన ఓటారు నమోదు ప్రత్యేక కేంద్రాలకు అనూహ్య స్పందన ...

Read More »