Breaking News

రోడ్డు భద్రతా వారోత్సవాల గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత వారోత్సవాలు 2019 గోడప్రతులను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు సోమవారం తన చాంబరులో విడుదల చేశారు. ఈనెల 4వ తేదీ నుంచి 14 వరకు నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వాహనాలకు అతికించే స్టిక్కర్లను ప్రజలకు పంపిణీ చేసే కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారోత్సవాలను 4వ తేదీ నుంచి 10 వరకు నిర్వహించాల్సి ఉండగా, వీటిని ఈనెల 14 వరకు పొడిగించడం జరిగిందని, ప్రజలు వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, ఇతర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిచాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో డిటివో వెంకట్‌రెడ్డి, రవాణాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *