Breaking News

మండల ప్రాదేశిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రాదేశిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించాలని కులాస్‌పూర్‌ గ్రామానికి చెందిన మాల, మాదిగ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ప్రజావాణిలో ఈ అంశంపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు.

కులాస్‌పూర్‌ గ్రామంలో మాల, మాదిగలకు చెందిన సుమారు 400 మంది ఓటర్లున్నారని, 50 సంవత్సరాల నుంచి తమకులాలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కలగలేదని విన్నవించినప్పటికి జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదని వారు వాపోయారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు రిజర్వేషన్‌ కల్పించలేదని, దీనివల్ల తాము ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డామని రాబోవు ఎంపిటిసి ఎన్నికల్లో తమ కులాలకు రిజర్వేషన్‌ కల్పించి తద్వారా గ్రామాభివృద్దిలో సేవచేసే అవకాశం కల్పించాలని వారు కోరారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *