Daily Archives: February 5, 2019

సర్పంచ్‌కు సన్మానం

రెంజల్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ ఆద్వర్యంలో ముదిరాజ్‌ సంఘం మండల కమిటీ సభ్యులు సర్పంచ్‌ మర్ల రమేశ్‌ను ఘనంగా సన్మానించారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ సర్పంచ్‌గా ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌ రమేశ్‌ను తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ మండల అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి పోశెట్టి సర్పంచ్‌ను పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ మండల ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌, సంతోష్‌, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు బహుమతులు అందజేత

రెంజల్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని సర్పంచ్‌ సునీత అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్‌బిలోలి ఉన్నత పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గతనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్‌ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు ఆంజనేయులు, సాయిలు, ఎంపిటిసి సంధ్య, మాజీఎంపిటిసి నర్సయ్య, నాయకులు ప్రవీణ్‌, క్రాంతికుమార్‌, పిఆర్‌టియు రాష్ట్ర నాయకులు రాజేందర్‌ ...

Read More »

సర్పంచ్‌కు సన్మానం

రెంజల్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌ వెల్మల సునీతను మంగళవారం ఉపాధ్యాయ బృందం పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. పాఠశాల అభివృద్దికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిటిసి సంధ్య, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, సాయిలు, రాజేందర్‌ సింగ్‌, మాజీ ఎంపిటిసి నర్సయ్య, ప్రవీణ్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సర్పంచ్‌లకు సన్మానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగపేట్‌ మండలాలకు చెందిన గిరిజన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను మంగళవారం ఘనంగా సన్మానించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా గిరిజనులకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడంతో జనవరి 25న జరిగిన రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన బంజారా సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఎల్లారెడ్డి ఆలిండియా బంజారా సేవాసంఘ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయా మండలాల సర్పంచ్‌లు, గిరిజన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

కలప అక్రమ వ్యాపారం ఉపేక్షించేది లేదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ చట్టాలకు వ్యతిరేకంగా కలప అక్రమ వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు హెచ్చరించారు. కలప అక్రమ రవాణాకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్‌ అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌ సమావేశమందిరంలో కలప మిల్లు యజమానులకు, పోలీసు, అటవీ అధికారులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అందరు గమనిస్తున్నారని, కలప అక్రమ రవాణాను ...

Read More »

మూడురోజుల్లో బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడురోజుల్లో రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు సూచించారు. మంగళవారం తన చాంబరులో వ్యవసాయాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెట్టుబడి సాయం సబ్సిడీ కింద రెండవ విడతలో ఇంకా 5 వేల 568 మంది రైతుల బ్యాంకు వివరాలు నమోదు చేయాల్సి ఉందని వీరిలో చాలా మంది అందుబాటులో లేనందున నమోదు చేయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కావున ఆయా గ్రామ పంచాయతీల్లో రైతుల వివరాలు ...

Read More »

మెను ప్రకారం భోజనం అందించాలి

మోర్తాడ్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాలకు సంబంధించి మోర్తాడ్‌ మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో మంగళవారం ఎంఇవో ఆంధ్రయ్య అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండలంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఐటిఫామ్స్‌ దాఖలు చేయాలని, ఎండిఎం మెసేజ్‌ను అన్ని పాఠశాలలు పంపించాలని ఎంఇవో ఆదేశించారు. అలాగే మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాలలోని పాఠశాలల్లో సమయపాలన పాటించాలని, విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని అన్నారు. సమావేశంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కంటి వెలుగు ప్రారంభం

మోర్తాడ్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని దోన్‌పాల్‌ గ్రామంలో మంగళవారం సర్పంచ్‌ దేవన్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కౌసల్య మాట్లాడుతూ ప్రజలు కళ్లను నిర్లక్ష్యం చేయొద్దని, ఏ కొంచెం మబ్బుగా కనిపించినా, కంటినొప్పి అనిపించినా వెంటనే కంటి వైద్యుని సంప్రదించాలని సూచించారు. మనిషి శరీర భాగాల్లో కళ్లు కూడా అత్యంత ప్రదానమని, నిర్లక్ష్యం వహించవద్దని సర్పంచ్‌ దేవన్న పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ...

Read More »