Daily Archives: February 6, 2019

28వ తేదీలోపు గుర్తింపు పత్రం పొందాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నడుపబడుచున్న వృద్దాశ్రమాలు తల్లిదండ్రులు, వయోవృద్దుల పోషణ సంక్షేమచట్టం 2007, నియమావళి 2011 ప్రకారం తప్పకుండా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలని వికలాంగుల మరియు వృద్దుల సంక్షేమ శాఖ సంచాలకులు ఒక ప్రకనలో తెలిపారు. ఒకవేళ గుర్తింపు లేని సంస్థలు ఫిబ్రవరి 28వ తేదీలోపు సంబందిత జిల్లా సంక్షేమాధికారి మహిళా, శివు, వికలాంగుల మరియు వృద్దుల సంక్షేమ శాఖ కార్యాలయంలో తప్పకుండా నమోదు చేసుకొని గుర్తింపు ...

Read More »

సేవాలాల్‌ జయంతిని అధికారికంగా జరపాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవాలాల్‌ జయంతిని ఎల్లారెడ్డిలో అధికారికంగా జరిపించాలని, అలాగే సేవాలాల్‌ జయంతి రోజు ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని ఆలిండియా బంజారా సేవసంఘ్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు రాథోడ్‌ లింబేస్‌, సెక్రెటరీ గోవింద్‌, జిల్లా ఉపాధ్యక్షుడు యశ్వంత్‌ రావు నాయక్‌,మలోత్‌ రాములు, కడవత్‌ రాములు,మలోత్‌ పాండు, కట్రాత్‌ లక్ష్మణ్‌ ,కట్రాత్‌ బిల్‌ సింగ్‌ , హరిచంద్‌ ,తవుర్య మరియు బంజారా సంఘం సభ్యులు కలిసి ఆర్డీఓ కార్యక్రమంలో ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్దిదారులకు బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూరు మండలాలకు చెందిన 41 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 18 లక్షల 75 వేల విలువగల చెక్కులను బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, జడ్పిటిసిలు మధు, నంద రమేశ్‌, ఏఎంసి ఛైర్మన్లు గోపిగౌడ్‌, అమృత్‌రెడ్డి, నాయకులు పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్‌రావులు అందజేశారు.

Read More »

యువకుని రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి రక్తం అవసరం కాగా కామారెడ్డికి చెందిన యువకుడు వెళ్ళి రక్తదానం చేశాడు. అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన బాబూఖాన్‌కు గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అవసరం కాగా శ్రీకాంత్‌ అనే యువకుడు హైదరాబాద్‌ వెళ్లి యశోదా ఆసుపత్రిలో రక్తదానంచేసి ప్రాణదాతగా నిలిచాడు.

Read More »

టెట్ర పాల కాంట్రాక్టు రద్దుచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మాతా శిశు సంక్షేమశాఖ, అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్బవతులు, బాలింతలకు పంపిణీ చేస్తున్న కెమికల్‌తో కూడిన టెట్ర పాల కాంట్రాక్టును రద్దు చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు. బుధవారం టెట్ర మిల్క్‌ ప్యాకెట్లను ఆయన బృందంతో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయ డైరీ మిల్క్‌ పాలను బంద్‌ చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన నందిని పేరుతోగల డెయిరీ మిల్క్‌ కంపెనీకి తెలంగాణ రాష్ట్ర ...

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ఎఫ్‌ఎల్‌సి నిర్వహణ

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఏడు నియోజకవర్గాల్లో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) బృందంతో ఫస్ట్‌ లెవల్‌ చెకప్‌ (ఎఫ్‌ఎల్‌సి) నిర్వహణ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం స్థానిక ఏఎంసి గోదాములో ఏర్పాటు చేసిన ఈవిఎంల ఎఫ్‌ఎల్‌సిని పరిశీలించారు. జహీరాబాద్‌ పార్లమెంటు స్థానానికి జిల్లా నుంచి నాలుగు నియోజకవర్గాలైన కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ, మెదక్‌ జిల్లాకు చెందిన ఆందోల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో బెల్‌ టీం బృందం ...

Read More »

చిరుత దాడి…

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని గండిమాసానిపేట పరిదిలోగల బాలాజీనగర్‌ తాండా పంట పొలాల్లో చిరుత దాడిచేసింది. గత కొన్నిరోజుల క్రితం తాండాలో ఆవుపై దాడిచేసి చంపి తినగా, తాజాగా కోతుల బెడద నివారణ కోసం కట్టేసి ఉంచిన కుక్కపై దాడిచేసి తినడంతో తాండా వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మంగళవారం అర్దరాత్రి చిరుత దాడిచేసి కుక్కను చంపింది. దీంతో తాండాతోపాటు చుట్టుపక్కల వాసులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని, చిరుతను ...

Read More »

రోగులకు సత్వర చికిత్స అందించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేరోగులకు సత్వర చికిత్స అందించాలని, అంటువ్యాదులు ప్రబలకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. కామారెడ్డి ఐఎంఎ హాల్‌లో బుధవారం ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌పాం శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వే లైన్స్‌ అధికారి డాక్టర్‌ రాజేశ్‌తో పాటు ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రాజారమేశ్‌, డిఎంఅండ్‌హెచ్‌వోలు పాల్గొని సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అంటువ్యాదులు ప్రబలిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు ...

Read More »

పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మాతృ వియోగం

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాతృమూర్తి పరిగె పాపవ్వ మంగళవారం రాత్రి స్వర్గస్తులయ్యారు. పాపవ్వకు 107 సంవత్సరాలు. పాపవ్వ మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఎంపి కవిత, తెరాస నాయకులు, తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం పోచారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, కామారెడ్డి కలెక్టర్‌ ...

Read More »

జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పిడిఎస్‌యు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కల్పన, గౌతంకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై నిజామాబాద్‌ ఇంటర్మీడియట్‌ అధికారికి వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశంపై హామీ ఇచ్చి అదికారంలోకి వచ్చినా ఇంతవరకు నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తుందని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా జోక్యం చేసుకొని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న ...

Read More »

కబడ్డి సంప్రదాయ క్రీడ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కబడ్డి మన సంప్రదాయ క్రీడ అని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. 2018 యువతరం రాష్ట్రస్థాయి కబడ్డి టోర్నమెంట్‌ను జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో బుధవారం కలెక్టర్‌ ప్రారంభించారు. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్రీడలు ఒకటి రెండు రోజులు మాత్రమే జరుగుతాయని, కానీ వాటివల్ల గెలుపు ఓటములు సహజమేనని, ఓడిపోయినపుడు కుంగిపోకుండా, గెలుపునకు బాటలు ఆలోచించడం దీనికి జీవితానికి అనుసంధానం ...

Read More »

వాహనాలు అప్రమత్తంగా నడపాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాహనాలను అప్రమత్తంగా నడపాలని జిల్లా రవాణా శాఖాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు బద్రతా వారోత్సవాల సందర్భంగా బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ద్వారా నాగారంలోని ఆర్టీఓ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. రవాణా శాఖ సూచించిన సూచికలను గమనిస్తు నడుచుకోవాలని, ద్విచక్ర వాహనదారులందరు హెల్మెట్‌ తప్పకుండా ...

Read More »

రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఆర్మూర్‌ రోడ్డులో రూట్‌ 63 డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలో ఇలాంటి తరహా రెస్టారెంట్‌ రావడం అభినందనీయమని, నగర అభివృద్దిలో భాగంగా ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా అబివృద్దికి సూచికగా ఇలాంటి రెస్టారెంట్లు రావాలన్నారు. ప్రయివేటుకు ధీటుగా నగరంలో డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమని, యువకులు నెలకొల్పడం హర్షించదగ్గవిషయమన్నారు. నిరుద్యోగులుగా ...

Read More »

కుక్కలు దాడిచేశాయి

మోర్తాడ్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలంలోని తడపాకల్‌ గ్రామంలో బుధవారం కుక్కలదాడిలో నెమలి మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. నెమలికి దాహం వేసి పసుపుకల్లాల వద్దగల నీటి గుంటలో నీరు తాగడానికి రావడాన్ని గమనించిన కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. గమనించిన రైతులు వారించగా కుక్కలు నెమలిని వదిలివెళ్లాయి. ఈ విషయమై కమ్మర్‌పల్లి అటవీ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని చనిపోయిన నెమలిని స్వాధీనం చేసుకుని ఖననం చేస్తామని తెలిపారు.

Read More »

జిల్లావాసికి సాహిత్య పురస్కారం

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ గోషిక నరసింహస్వామి ప్రతిష్టాత్మక కుందుర్తి రంజని అవార్డు అందుకున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ లోని ఎజి కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కుందుర్తి రంజని అవార్డు ప్రదాన సభలో ప్రఖ్యాత కవి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్‌ ఎన్‌.గోపి చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి కొండపల్లి నీహారిణి, బైస దేవదాసు, ఆశా ...

Read More »