Breaking News

Daily Archives: February 7, 2019

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షునికి సన్మానం

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన కైలాష్‌ శ్రీనివాస్‌రావును గురువారం కాంగ్రెస్‌ నాయకులు ఆయన స్వగృహంలో సన్మానించారు. పార్టీకి ఏళ్లతరబడిగా చేస్తున్న సేవలకు గాను అధిష్టానం గుర్తించి అధ్యక్షునిగా బాద్యతలు అప్పగించిందని నాయకులు పేర్కొన్నారు. ఆయన మరిన్ని పదవులు పొందాలని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు దాత్రిక సత్యం, నాయకులు సందీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునిగా కైలాష్‌ శ్రీనివాస్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌గాంధీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు నూతన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను ప్రకటించారు. కామరెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షునిగా మునిసిపల్‌ మాజీ ఛైర్మన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌రావు ఎంపికయ్యారు. నిజామాబాద్‌ పట్టణ కమిటీ అధ్యక్షునిగా కేశవేణు, నిజామాబాద్‌ అధ్యక్షునిగా మానాల మోహన్‌రెడ్డిలను అధిష్టానం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కైలాష్‌ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి పనిచేస్తున్నానని కౌన్సిలర్‌గా, మునిసిపల్‌ ఛైర్మన్‌గా పట్టణ కాంగ్రెస్‌ అద్యక్షునిగా సేవలందిస్తున్నానని ...

Read More »

పోచారంను పరామర్శించిన ముఖ్యమంత్రి

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తల్లి పాపవ్వ బుధవారం మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా బాన్సువాడకు చేరుకున్నారు. బాన్సువాడ నుంచి రోడ్డు మార్గం గుండా పోచారం వెళ్లారు. అనంతరం సభాపతి శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించారు. పాపవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోచారంను ఓదార్చారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, నిజామాబాద్‌ ఎంపి కవిత, ...

Read More »

పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న ఆశ వర్కర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని నిజామాబాద్‌ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లకు గత నాలుగు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని, పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించి వారిని ఆదుకోవాలని ఆమె ...

Read More »

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర శివారులోని ఖానాపూర్‌, అర్సపల్లి మద్యలోగల కెనాల్‌లో గుర్తు తెలియని మృతదేహం లభించినట్టు నిజామాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. మృతుడు ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అని, సుమారు 65 – 70 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. అర్సపల్లి విఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించామన్నారు.

Read More »

ఓటరు ఆన్‌లైన్‌ ప్రక్రియలో జిల్లా యంత్రాంగం పనితీరు భేష్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియలో జిల్లా అధికారుల పనితీరు బేషుగ్గా ఉందని రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ జాయింట్‌ సిఇవో రవికిరణ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి కలెక్టర్‌ చాంబరులో రిటర్నింగ్‌ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే నమోదు చేయడం వలన సకాలంలో పనులు పూర్తిచేయడానికి వీలు ...

Read More »

మహిళ ఆత్మహత్య

బాసర, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర పుణ్య క్షేత్రం బాసర లో గురువారం విషాదం చోటుచేసుకుంది. గోదావరి నది వంతెనపై నుంచి గుర్తు తెలియని మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు నదీతీరంలో శవం తెలియాడుతున్న విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాసర ఎస్‌ఐ మహేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని, గజ ఈతగళ్ళ సహాయంతో శవాన్ని బయటకు తీయించారు. మృతురాలి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నామని ,బహుశ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహిళ అయి వుంటుందని ...

Read More »

ఘనంగా మార్కండేయ జయంతి

నందిపేట్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని వెల్మల్‌ గ్రామంలో గురువారం భక్త మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, హారతి నిర్వహించారు. భక్తులకు తీర్థ, ప్రసాద వితరణ, మహా అన్నదానం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ దంపతులను పూలమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థుల టాలెంట్‌ ప్రదర్శన

నందిపేట్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉర్దూ హైస్కూల్‌ లో విద్యార్థుల నైపుణ్యతను వెలికితీయడానికి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపడానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అందులో పిల్లలు పాల్గొని వారిలోని నైపుణ్యాన్ని చాటుతు కొత్త వస్తువులను తయారుచేసి చూయించారు. గాజులు, కమ్మలు, హాండ్‌బాగ్‌, ఆర్టిఫిషల్‌ ఆభరణాలు, షోకేస్లో వాడే వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు. ఇందులో ఉపాద్యాయులు మరియు చిన్నతరగతికి చెందిన పిల్లలకు తాము చేసిన వస్తువుల తయారీని ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ వివరించారు. ఉపాధ్యాయులు ...

Read More »

కూర్న పల్లి లో కంటి వెలుగు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం గురువారంతో నాలుగో రోజుకు చేరింది. ఇప్పటివరకు కంటివెలుగు కార్యక్రమంలో 700లకు పైగా గ్రామస్తులు కంటి పరీక్షలు చేసుకున్నట్లుగా గ్రామసర్పంచి దుబ్బాక సావిత్రి రవీందర్‌ గౌడ్‌ తెలిపారు. 50 మందికి పైగా గ్రామస్తులకు కంటి అద్దాలు అందించామని, ఇంకా వంద మందికి అద్దాలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి గ్రామస్తులనుండి మంచి స్పందన వస్తుందని, ఈనెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ...

Read More »

ఛలో ఆర్మూర్‌ సక్సెస్‌ … భారీగా తరలివచ్చిన పసుపు రైతులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పణ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి కూడలిలో వేలాది రైతులు మద్దతు ధర కోసం గురువారం రోడ్డెక్కారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రధానంగా రైతులు, పసుపు, ఎర్ర జొన్న పంటలను సాగు చేస్తున్నారు. కానీ వారు పండించిన పంటలకు సరైన మద్దతు ధర రాక పోవడంతో పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్ధితి లేదు.దీనితో రైతులు అప్పుల పాలు అవుతున్నారు. 2 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంటలకు ధర లేక నష్ట ...

Read More »