Breaking News
కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

కూర్న పల్లి లో కంటి వెలుగు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం గురువారంతో నాలుగో రోజుకు చేరింది. ఇప్పటివరకు కంటివెలుగు కార్యక్రమంలో 700లకు పైగా గ్రామస్తులు కంటి పరీక్షలు చేసుకున్నట్లుగా గ్రామసర్పంచి దుబ్బాక సావిత్రి రవీందర్‌ గౌడ్‌ తెలిపారు.

50 మందికి పైగా గ్రామస్తులకు కంటి అద్దాలు అందించామని, ఇంకా వంద మందికి అద్దాలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి గ్రామస్తులనుండి మంచి స్పందన వస్తుందని, ఈనెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌ తెలిపారు.

గురువారం నాటి కంటి వెలుగులో మాజీ సర్పంచ్‌ దుబ్బాక రవీందర్‌ గౌడ్‌, డాక్టర్‌ నిరోషా, సాంకేతిక సిబ్బంది వెంకట్‌, రమేష్‌,ఏన్‌ఎం శాంత ,ఆశా కార్యకర్తలు సరిత, లత, కవిత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *