Breaking News
స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, నగదు

బెట్టింగ్‌ నిర్వాహకుల అరెస్ట్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం సంజీవయ్య కాలనీలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు యువకులను ఆధువులోకి తీసుకున్నట్లు మూడవ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. శుక్రవారం టాస్క్‌ ఫోర్స్‌, మూడవ టౌన్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు ఆనంద్‌, విక్రమ్‌, సంజీవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 2 లక్షల 5 వేల నగదు, 5 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏస్‌ఐ కష్ణ తెలిపారు. వీరితో పాటు బెట్టింగ్‌లో ఇరవై మంది పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు ఏస్‌ఐ తెలిపారు.

ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సిఐలు జగదీష్‌, సత్యన్నారాయణ, మూడవ టౌన్‌, టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *