Daily Archives: February 9, 2019

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి జిల్లా స్థాయిలో వ్యవసాయ, ఉద్యానశాఖ అదికారులు సంయుక్తంగా కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శనివారం కలెక్టర్‌ చాంబరులో వ్యవసాయ, ఉద్యానశాఖల మార్కెటింగ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇరుశాఖల ఆద్వర్యంలో వివిధ రకాల నేలలు, పంటల వివరాలు, సాగుతో రూపొందించిన సమాచారాన్ని సర్వేచేసి రాష్ట్రానికి పంపించాలని ఆదేశించారు. పంటలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని నేల పరీక్షను ప్రింట్‌ చేయాలని ...

Read More »

ఓటరు నమోదు ఫిర్యాదులు వెంటనే నమోదు చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న ఓటరు తుది జాబితా వెలువడుతున్నందున ఓటరు నమోదు క్లెయిమ్స్‌ను వెంటనే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆర్డీవోలను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఓటరు నమోదు స్పెషల్‌ సమ్మరి రివిజన్‌, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సమీక్షించారు. ఈనెల 4వ తేదీ వరకు వచ్చిన ఫిర్యాదులను క్లియర్‌ చేయాలని, డుప్లికేట్‌ ఓటరు నమోదులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి వాటిని పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ...

Read More »

వాహనాల తనిఖీ

రెంజల్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ తెలంగాణ చౌరస్తాలో శనివారం వారాంతపు సంత సందర్భంగా ఇతర ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలను ఎస్‌ఐ శంకర్‌ ఆద్వర్యంలో తనిఖీ చేశారు. లైసెన్సు, ఆర్‌సి, ఇన్సురెన్సు లేని 15 వాహనాలకు రూ. 1500 జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని, వాహన పత్రాలు కలిగిఉండాలని ఆయన అన్నారు. లేకపోతే జరిమానాలు విదిస్తామని ఎస్‌ఐ అన్నారు.

Read More »

యోగాతో ఆరోగ్యం

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి పిఎంకెవివై కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో నిర్వహించబడుతున్న యోగభౌతిక ఆర్‌పిఎల్‌-4 పరీక్ష స్థానిక ఆర్యసమాజములో పతంజలి యోగసమితి నిజామాబాద్‌ వారు శనివారం నిర్వహించారు. పతంజలి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుశ్రీనాయర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరీక్షకు హాజరైన 50 మంది అభ్యర్థులకు యోగ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వివరిస్తు ప్రతి ఒక్కరు తమ తమ స్థానాల్లో ఉచిత యోగ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. యోగాతో చక్కటి ఆరోగ్యం ...

Read More »

యునాని వైద్యంపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యునాని వైద్యాన్ని ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేదుకు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. డాక్టర్‌ అజ్మల్‌ అసన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ యునాని దినోత్సవం సందర్భంగా నగరంలోని పెద్ద బజారులో గల వైద్యశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యునాని వైద్యం పురాతనమైందని ఈ చికిత్స వలన ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ ఉండదని ప్రజలందరూ పురాతన ...

Read More »

ఇందూరు తిరుమల క్షేత్రానికి ఉచిత బస్సు

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశేష ఏకాంత సేవలో పాల్గొనె భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్‌ నగరం నుండి ఇందూరు తిరుమల క్షేత్రం నర్సింగ్‌పల్లికి ఉచిత బస్సు ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. విశేష ఏకాంత సేవలో పాల్గొనే భక్తులకు ప్రతి శనివారం సాయంత్రం 6:30. గంటలకు వినాయకుల బావి దగ్గర, త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్‌ ఎదురుగా ప్రెసిడెన్సీ పాఠశాలకు చెందిన బస్సు ఉంటుందన్నారు. భక్తులను తీసుకుని 7 గంటలకు వినాయక్‌ నగర్‌ నుండి నర్సింగ్‌పల్లికి ...

Read More »