Breaking News
ఫోన్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న సిపి కార్తికేయ

డయల్‌ యువర్‌ సిపికి 9 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతిసోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమానికి 9 ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌ డివిజన్‌ల నుంచి ప్రజలు డయల్‌ యువర్‌ సిపి ద్వారా సిపికి తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. వీటిపై సిపి స్పందిస్తు బాధితులకు సత్వర న్యాయం చేస్తామని, ఫిర్యాదుల్లో పేర్కొన్న విధంగా సంబందిత పోలీసు అదికారులకు తెలియపరిచి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలు ఏమైనా సమస్యలుంటే డయల్‌ యువర్‌ సిపిని వినియోగించుకోవాలని కమీషనర్‌ సూచించారు. కార్యక్రమంలో స్పెషల్‌బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వర్లు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *