Daily Archives: February 12, 2019

జుక్కల్‌ నియోజకవర్గాన్ని రూర్బన్‌ నిధులతో అభివృద్ది పరచాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజకవర్గాన్ని రూర్బన్‌ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ది పరిచి అధునాతనంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. మంగళవారం జనహితలో రూర్బన్‌ పనుల పురోగతిపై గ్రామీణాభివృద్ది, పంచాయతీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జుక్కల్‌ మండలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది పరచడానికి 257 పనులకుగాను 25 కోట్లకు పైబడి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. గోదాములు, ప్లాట్‌ఫాం, ఆడిటోరియం, లైబ్రరీ, శిక్షణ కేంద్రాలు, బస్‌ షెల్టర్లు, మౌలిక సదుపాయాలు, అంగన్‌వాడి, పాఠశాలలు, ఎల్‌ఇడి ...

Read More »

ప్రతి కార్యకర్త తన ఇంటిపై బిజెపి జెండా ఎగురవేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి కుటుంబమే నా కుటుంబం అనే నినాదంతో ప్రతి బిజెపి కార్యకర్త తన ఇంటిపై బిజెపి జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని కామారెడ్డిలో మంగళవారం ప్రారంభించారు. బిజెపి జాతీయ నాయకుల ఆదేశాల మేరకు మంగళవారం నుంచి మార్చి 2వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 5 కోట్ల ఇళ్లపై బిజెపి జెండాలు ఎగురవేస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ తేలు శ్రీనివాస్‌ ఇంటిపై బిజెపి జెండా ఆవిష్కరించారు. నరేంద్రమోడికి మరోసారి ప్రధానిగా గెలిపించాలనే లక్ష్యంతో ...

Read More »

ఆక్వా కల్చర్‌ అభివృద్దికి చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షేత్ర స్థాయిలో పర్యటించి జిల్లాలో ఆక్వా కల్చర్‌ అభివృద్దికి చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జిల్లా మత్స్యశాఖాధికారులకు సూచించారు. మంగళవారం ఆయన చాంబరులో జరిగిన మత్స్యశాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఐఎఫ్‌డిఎస్‌ కింద 11 ప్రతిపాదనలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చేపల చెరువుల నిమిత్తం ఒక యూనిట్‌కు 75 శాతం సబ్సిడీపై 8 లక్షల 50 వేలు అందించనున్నట్టు తెలిపారు. ఇందుకుగాను రెండు హెక్టార్ల ...

Read More »

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన చాంబరులో పది పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో 55 ప్రభుత్వ, 5 ప్రయివేటు పాఠశాలలు మొత్తం 60 పాఠశాలల్లో పది పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 12 వేల 767 మంది విద్యార్థులకు పరీక్షకు హాజరుకానున్నట్టు చెప్పారు. ...

Read More »

చదువుతో పాటు చేయబోయే ఉద్యోగంపై అవగాహన ఉండాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు చిన్ననాటి నుండే చదువుతోపాటు చేయబోయే ఉద్యోగంపై అవగాహన ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. మంగళవారం స్థానిక ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ది సంస్థ లిమిటెడ్‌ ఆద్వర్యంలో షెడ్యూలు కులాల నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రాం చిత్రపటాలకు పూలమాలలువేసిన అనంతరం మాట్లాడారు. చదువును మధ్యలో వదిలివేయొద్దని, ...

Read More »

ఘనంగా వెంకటేశ్వర కళ్యాణం

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రథసప్తమిని పురస్కరించుకుని మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు, స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రతి సంవత్సరం రథ సప్తమిని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నిరంజని, ఉపసర్పంచ్‌ జలయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కాశం సాయిలు, మోహన్‌, ...

Read More »

అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్ర జొన్న, పసుపు రైతులకు మద్దతుగా రైతు సంఘం నాయకులు చేపట్టిన మహాదీక్షలో పాల్గొనకుండా రైతులను ముందస్తుగా అక్రమ అరెస్టులు రైతు ఉద్యమాన్ని ఆపలేవని సిపిఐ ఎంఎల్‌ రెంజల్‌ మండల నాయకులు పార్వతి రాజేశ్వర్‌, నసీర్‌ అన్నారు. సోమవారం మామిడి పల్లి చౌరస్తాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు ఆందోళన దీక్ష చేపట్టాలని పిలుపునివ్వడంతో పోలీసులు రైతులను దీక్షలో పాల్గొనకుండా రైతు సంఘం నాయకులను ముందస్తుగా రెంజల్‌ పోలీసు ...

Read More »

ఆదుకోండి మహాప్రభో

బాసర, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన షెల్కే నాగనాథ్‌ ఎస్‌సి కులస్తుడు. వ్యవసాయ పనిమనిషిగా గత 6 సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన కుర్మె మల్లు వద్ద పని చేస్తున్నాడు. భార్య సంధ్యా. 15 రోజుల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో 9వ తేదీ శనివారం రాత్రి యజమాని ఆదేశానుసారం రోజులాగే పంట కాపలా కోసం వెళ్లి అడివి పందులు రాకుండా టపకాయలు పేల్చడంతో ప్రమాదవశాత్తు అతని శరీరం మొత్తం ...

Read More »

ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ బండ్లగూడలోని పెబెల్‌ సిటీ నివాస సముదాయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని విద్యుత్‌ అధికారులు ...

Read More »

వాట్సప్‌ గ్రూపులు ఆగిపోతే…..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నట్టుండి వాట్సాప్‌ గ్రూపులు ఆగిపోతే..? అసలు వాట్సాప్‌ మెసెంజరే పనిచేయకపోతే..? అదే పరిస్థితి ఏపీ టీడీపీ నేతల్లో ఎదురవుతుంది..? ఎవరూ కంప్లైంట్‌ చేశారో ఏమని కంప్లైంట్‌ చేశారో తెలియకుండా వరుసగా వాట్సాప్‌ మెసెంజర్‌లు బ్లాక్‌ అవుతున్నాయి. అందులో తొలి బాధితుడు ఎంపీ సీఎం రమేష్‌. టీడీపీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన సీఎం రమేష్‌కు విచిత్ర అనుభవం ఎదురైంది. వాట్సప్‌ సమాచారం పరుగులు పెడుతున్న వేళ ఆ సంస్థ ఓ కీలక నిర్ణయం ...

Read More »

లంబాడీ హట్టిలో పోలీసుల తనిఖీలు

కొమరం భీమ్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొమరంభీమ్‌ జిల్లా చింతల మానేపల్లి మండలం లంబాడీ హట్టిలో పోలీస్‌, అటవీశాఖ అధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సోదాల్లో భారీగా కలప, గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. చెట్ల నరికివేత, అటవీ ఆక్రమణలు, గుడుంబా తయారీ తక్షణం నిలిపివేయాలని గ్రామస్థులను హెచ్చరించారు. అటవీ నేరాలకు పాల్పడవద్దని, గుడుంబాతో అనారోగ్యాలు తెచ్చుకోవద్దని కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఉల్లంఘనలపై పీడీ కేసులు పెడతామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉపాధి ...

Read More »

స్వచ్ఛ ఘన్‌పూర్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం స్వచ్ఛ గన్‌పూర్‌ లో భాగంగా 5వ వార్డులో పాఠశాల వెనక భాగంలో వినాయకరావు ఇంటి నుంచి గోపీచంద్‌ ఇంటి వరకు మురికి కాలువ శుభ్రం చేశారు. మొత్తం మట్టితో ఆకుతో నిండిపోయి ఉండడంతో గన్‌పూర్‌ యువకులు శ్రమదానం చేశారు. అలాగే చాకలి గల్లీలో ఉన్న ఆకులు, ఇతర వ్యర్థ పదార్థాలు ఒక చోటికి చేర్చి నిప్పుపెట్టారు. కార్యక్రమంలో దాసు సాయినాథ్‌, కష్ణ ప్రసాద్‌, సాగర్‌, వెంకటేష్‌, అశోక్‌, సాయిలు, గవాస్కర్‌ సుధాకర్‌, ...

Read More »

రబీ పంటలపై అవగాహన సదస్సు

బీర్కూర్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బీర్కూరు మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో రైతు క్లబ్‌ ఆవరణలో తిమ్మాపూర్‌, బీర్కూరు తండా, తిమ్మాపూర్‌ తండా గ్రామస్తులకు రబీ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బీర్కూరు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రభి పంటలపై అవగాహనా సదస్సుకు జిల్లా వ్యవసాయ అధికారి జే. సి. నాగేంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా రబీలో వేసుకున్న వరి పంట, ఇతర ఆరుతడి పంటల యాజమాన్య పద్ధతులు, చీడపీడల, తెగుళ్లు నివారణకు రైతులు తీసుకొవాల్సిన ...

Read More »

నేడు రథసప్తమి

సమస్త జీవరాశికీ సూర్యుడే ఆధారం. అందుకే సూర్యుడిని వేదాలు త్రిమూర్తి స్వరూపంగా పేర్కొన్నాయి. మూడు సంధ్యల్లోనూ ఆదిత్యుడిని ఆరాధించేందుకు సంధ్యా వందన నియమాన్ని ఏర్పాటు చేశాయి. భూమ్మీద మొదట దర్శనమిచ్చిన దైవంగా హైందవులు భాస్కరుడిని పూజిస్తారు… ఆ దివాకరుడు పుట్టిన రోజైన మాఘ శుద్ధ సప్తమినే రథ సప్తమిగా పేర్కొంటారు. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌’ అంటే ఆరోగ్యాన్ని భాస్కరుడు ప్రసాదిస్తాడని అర్థం. అందుకే రథసప్తమినే ఆరోగ్య సప్తమి అనికూడా అంటారు. ఈ రోజు చేసిన సూర్యుడి ఆరాధనా, దానధర్మాల వల్ల ఈ జన్మలోనేకాదు గడిచిన జన్మల్లోనూ ...

Read More »

12 ఫిబ్రవరి 2019 మంగళవారం

మాఘ – విలంబి సంవత్సరం ఆయనము : ఉత్తరాయణం ఋతువు : శిశిర కాలం : శీతా కాలం పక్షము : శుక్ల పక్షము సూర్యోదయము : 6:46 ఉ. చంద్రోదయం : 11:37 ఉ. సూర్యాస్తమయం : 6:20 సా. చంద్రాస్తమయం : 12:25 రా. సూర్య రాశి : మకరము చంద్ర రాశి : వ షభం పంచాంగం: వారం : మంగళవారం తిథి : సప్తమి ముగింపు 03:54 సా. అష్టమి ప్రారంభం నక్షత్రం : భరణి ముగింపు 10:11 ...

Read More »