Breaking News
అవగాహన సదస్సులో పాల్గొన్న అధికారులు

ఘనంగా ఓరల్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జన్స్‌ డే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులో మల్లారం వద్దగల మేఘన దంత కళాశాలలో బుధవారం ఓరల్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జన్స్‌ డే, 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటి, మేఘన దంత కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణాశాఖాధికారి వెంకట్‌రెడ్డి మాట్లాడారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని అన్నారు. కారు యజమానులు ఎల్లవేళలా సీటు బెల్టు ధరించి వాహనం నడిపించాలన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రాపిక్‌ నిబంధనల గురించి వివరించారు. దంత కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రతాప్‌కుమార్‌ మాట్లాడుతూ భారతదేశంలో నోటి క్యాన్సర్‌ ప్రపంచ రాజధానిగా నిలిచిందని అన్నారు. నోటి క్యాన్సర్‌ వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీన్ని నివారించడానికి ప్రజలు పొగాకు, గుట్కా, జర్దా లాంటి అలవాట్లను మానుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో తెలంగాణ నర్సింగ్‌హోం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీశైలం, ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ జయప్రకాశ్‌, మేఘన దంత కళాశాల సిబ్బంది, డాక్టర్‌ కళ్యాణ్‌, డాక్టర్‌ సాంబశివరావు, సాయిచంద్‌, అపూర్వ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *