Daily Archives: February 14, 2019

పథకాలు అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీ నుండి 25 వరకు రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న జిల్లా సమగ్రాభివద్ధికి అవసరమైన ప్రాధాన్యత పనులను చేపట్టేందుకు అధిక మొత్తంలో నిధుల మంజూరుకు ప్రణాళిక రూపొందించి పంపాలని నిజామాబాద్‌ ఎంపి కవిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌లో జెసి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ మార్కెటింగ్‌, వ్యవసాయ, ఉద్యానవన, ఆర్‌అండ్‌బి, నగరపాలక సంస్థ, ...

Read More »

వివాహిత ఆత్మహత్య యత్నం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయిన భర్త బాధలు తట్టుకోలేక వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటన 6వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో అసద్‌నగర్‌లోని అపార్టుమెంటులో గురువారం చోటుచేసుకుంది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ కథనం ప్రకారం…. నగరంలోని అసద్‌నగర్‌లో నివాసముంటున్న జరీనాబేగం, తాజ్‌ దంపతులు కూలీ పనిచేసుకుంటు జీవనం గడిపేవారు. ఐదేళ్ళ క్రితం హిజ్రాగా మారిన జరీనాబేగంకు, తాజ్‌తో ఎనిమిది నెలల క్రితం ...

Read More »

ప్రతి కార్యకర్త ఇంటిపై బిజెపి జెండా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఇందూర్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ లో ధన్‌పాల్‌ సూర్యనారాయణ ఇంటి మీద మేర పరివార్‌ బీజేపీ పరివార్‌ లో భాగంగా బీజేపీ జెండా ఎగురవేశారు. పేద ప్రజల కోసం నరేంద్రమోదీ గారు చేపడుతున్న పథకాలు అద్భుతమని, ప్రతి ఒక్కరి నోటా నరేంద్రమోదీ మాట ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాలు సైతం మోదీ గారి పరిపాలనను సైతం మెచ్చుకుంటున్నారని ధన్‌పాల్‌ అన్నారు. దేశంలో గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ అవినీతివల్ల ...

Read More »

పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం నిజామాబాద్‌ ఎంపి కవిత బిజీ…బిజీ…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం బిజీ బిజీగా గడిపారు. నిజామాబాద్‌ నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమెకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. కరచాలనం చేసేందుకు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు, సిబ్బంది తమ చప్పట్లతో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికైన ఎంపీ కవితకు అభినందనలు తెలిపారు. టిఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు కిషన్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది. ఎన్జీవో నాయకులు గజమాలతో ఎంపీ కవితను సన్మానించారు. మత్స్యకారులు సైతం ...

Read More »

ప్రైవేట్‌ టెలికాం సంస్థలకు దీటుగా బిఎస్‌ఎన్‌ఎల్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేట్‌ టెలికాం సంస్థలకు దీటుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు విస్తరించి ప్రజల మన్ననలు పొందాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో ఎంపీ కవిత అధ్యక్షతన జరిగిన జిల్లా టెలికాం సలహా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటి సంస్థ అని, దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ప్రైవేట్‌ టెలికాం సంస్థలను తట్టుకొని ముందుకుపోవాలని మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని పేర్కొన్నారు. నిజామాబాద్‌ నగరంలో ...

Read More »

సన్నబియ్యానికి రూ.35.90

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించే సన్నబియ్యం కొనుగోలులో పౌరసరఫరాల సంస్థ రైస్‌ మిల్లర్లతో జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలను ఇచ్చాయి. గత ఏడాది సరఫరా చేసిన ధరకే ఈ ఏడాది కూడా సన్నబియ్యం సరఫరా చేయడానికి రైస్‌ మిల్లర్లు అంగీకరించారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు , మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏడాదికి 1.20 ...

Read More »

మార్చి 4 నుంచి కీసరగుట్ట ఉత్సవాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కీసర గుట్టలో ప్రతియేటా నిర్వహించే బ్ర¬్మత్సవాలను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 4వ తేదీ నుంచి 7 వరకు బ్ర¬్మత్సవాలు కొనసాగనున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలు, పరిసర మండలాల నుంచి తరలివచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పారిశుధ్యాన్ని మరింత మెరుగు పరచాలని, ఉచిత వైద్య శిబిరాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకై ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ...

Read More »

నీరు…నీరు…నీరూ… రైతుకంట కన్నీరు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చ బంగారం రైతు కంట కన్నీటినే మిగిలిస్తోంది. ఆరుగాలం చెమట చిందించి పండించిన పసుపు పంట చివరకు నష్టాలే మూటగడుతోంది. ఎకరాన కనీసం రూ.1.32 లక్షల వరకు ఖర్చు చేసి సాగు చేస్తే.. లాభాలు అటుంచి కనీసం పెట్టుబడి కూడా రాలేని దుస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 33 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. అత్యధికంగా ఆర్మూర్‌ డివిజన్‌లోని నందిపేట్‌, వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, బాల్కొండ, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ ...

Read More »

శుక్రవారం ఉత్తర తిరుపతి క్షేత్రం ప్రతిష్టాపన కుంభాభిషేకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తర తిరుపతి క్షేత్రం ప్రతిష్టాపన, కుంభాభిషేకం ఉంటుందని ప్రజలందరూ హాజరై స్వామివారి కపకు పాత్రులు కాగలరని శ్రీ అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఈ మేరకు గురువారం నగర శివారులోని గుపన్‌పల్లి గంగస్తాన్‌ ఫేస్‌ -2 లో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవులు తమ జీవన కాలంలో మూడు కుంభాభిషేకం చూస్తే జీవితం ధన్యం అవుతుందని, అలాంటిది ఏకకాలంలో భక్తుల ...

Read More »