Breaking News

వివాహిత ఆత్మహత్య యత్నం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయిన భర్త బాధలు తట్టుకోలేక వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటన 6వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో అసద్‌నగర్‌లోని అపార్టుమెంటులో గురువారం చోటుచేసుకుంది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ కథనం ప్రకారం….

నగరంలోని అసద్‌నగర్‌లో నివాసముంటున్న జరీనాబేగం, తాజ్‌ దంపతులు కూలీ పనిచేసుకుంటు జీవనం గడిపేవారు. ఐదేళ్ళ క్రితం హిజ్రాగా మారిన జరీనాబేగంకు, తాజ్‌తో ఎనిమిది నెలల క్రితం సిఐటియు కార్యకర్తల సమక్షంలో వివాహం జరిగింది. లక్ష రూపాయల కట్న కానుకలతో లాంఛనంగా వివాహం జరిపించామని, మూడునెలలు సాఫీగా వారి కుటుంబజీవనం సాగిందని, మద్యానికి బానిస అయిన తాజ్‌ మరో 30 వేలు అదనపు కట్నం తేవాలని భార్యను తరచూ హింసించేవాడన్నారు. ఈ క్రమంలో గురువారం ఆత్మహత్య యత్నానికి పాల్పడగా గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాజ్‌ కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *