Daily Archives: February 15, 2019

ఎంపిని సన్మానించిన రజక సంఘం ప్రతినిధులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ పార్లమెంటెరియన్‌గా అవార్డ్‌ పొందిన ఎంపి కవితకి రజక సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మానస గణేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఎంపి అవార్డ్‌ పొందడం తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లా వాసులంధరికి కూడా గర్వకారణంగా ఉందని, క్రమశిక్షణ, ప్రజాసమస్యల పట్ల భాధ్యత, నిబద్ధత, మాటల్లో స్పష్టత, నిక్కచ్చితత్వం, పనులు నెరవేర్చే విషయములో పట్టుదల, సేవే పరమావధిగా పనిచేస్తున్న ప్రజా సేవకురాలికి ఉత్తమ పార్లమెంటెరియన్‌ అవార్డ్‌ రావడం ఆనందంగా ...

Read More »

వ్యాయామం ద్వారా ఆరోగ్యం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణేష్‌ గుప్తా సూచించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వినాయక్‌ నగర్‌లో యమహా షోరూం పైన ఫిట్‌ 24జిమ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు తమ దైనందిన జీవితంలో బిజీగా మారిపోయారని తద్వారా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. రోజువారీ జీవన విధానంలో ...

Read More »

అమరవీరులకు నివాళులు

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాశ్మీర్‌లో టెర్రరిస్టులు జరిపిన ఉగ్రదాడిలో చనిపోయిన వీర జవాన్లకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ టెర్రరిస్టులను పెంచిపోషిస్తూ ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతుందని దుయ్యబట్టారు. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం సన్నద్దమవుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాదులు జరిపిన మారణ ...

Read More »

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాశ్మీర్‌లో సైనికులపై దాడిచేసి వారి మృతికి కారణమైన ఉగ్రవాదుల దిష్టిబొమ్మను శుక్రవారం కామారెడ్డిలో ఏబివిపి నాయకులు దగ్దం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ జాతీయ జెండాలు చేతబూని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బస్సులో వెళుతున్న సైనికులపై దాడిచేసి వారిని చంపడం ఉగ్రవాదుల పిరికి చర్య అని పేర్కొన్నారు. ఉగ్రవాదుల చర్యకు ప్రభుత్వం నుంచి ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని, టెర్రరిస్టులను మట్టుబెడతారని పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఉగ్రచర్యను తీవ్రంగా ...

Read More »

కాంగ్రెస్‌ నాయకుల రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ మహ్మద్‌ షబ్బీర్‌ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్‌ నాయకులు రక్తదానం చేశారు. జిల్లా అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావుతోపాటు కాంగ్రెస్‌ నాయకులు రక్తదానంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో సైనికులు మరణించినందున జన్మదిన వేడుకలను రద్దుచేసి సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పండ్ల రాజు, నిమ్మ దామోదర్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, విజయ్‌, రాజేశ్వర్‌, కారంగుల అశోక్‌రెడ్డి, అంజద్‌, ...

Read More »

ఓటింగ్‌ యంత్రాలపై పూర్తి పరీక్షలు నిర్వహించాం

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించే ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై ఎలాంటి అపోహలు, సందేహాలు ఉండకుండా కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అదికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిందని, ఎన్నికలపై పరీక్షలు నిర్వహించి దృవీకరించిందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జనహితలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రె మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో వినియోగించే యంత్రాలపై ఫస్ట్‌ లెవల్‌ చెకప్‌ పూర్తిస్తాయిలో నిర్వహించినట్టు ...

Read More »

నిరుద్యోగులకు ఉపాధి కోసం జాబ్‌మేళ

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతకు ప్రయివేటు విద్యాసంస్థల్లో ఉపాది కల్పించేందుకు జిల్లాలో మెగా జాబ్‌మేళ ఏర్పాటు చేసినట్టు జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం దీన్‌దయాళ్‌యోజన, ఇజిఎంఎం, సెర్ప్‌ ద్వారా ఏర్పాటైన జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ మెగా జాబ్‌మేళాకు ఆయన హాజరై మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన 42 కంపెనీలు ఎస్‌ఎస్‌సి నుంచి డిగ్రీ వరకు అర్హతగల నిరుద్యోగ యువతీ, యువకులు వివిధ రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. వెనకబడిన ప్రాంతాలైన ఎల్లారెడ్డి, ...

Read More »

వీర జవాన్లకు దివ్యాంగుల నివాళి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమ్మూ కాశ్మీర్‌లో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వీర జవానుల ఆత్మకు శాంతి కలగాలని శుక్రవారం మండలంలోని సాటాపూర్‌ లోని భవిత దివ్యాంగుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మేము సైతం అమరవీర జవాన్లకు శ్రద్ధాంజలి అర్పిస్తాం అంటూ కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వనాథ్‌, స్వప్న విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ఎంపీ కవితను కలిసిన సర్పంచ్‌

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవితను శుక్రవారం దండి గుట్ట గ్రామ సర్పంచ్‌ శ్రీదేవి గ్రామస్తులు నిజామాబాదులోని ఎంపీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న ఎంపీ కవితను అభినందించారు. దండిగుట్ట గ్రామాభివృద్దికి ఎంపీ సహాయ సహకారాలు అందిస్తే వాళ్ల గ్రామాన్ని మరింత అభివద్ధికి కషి చేస్తామని సర్పంచ్‌ శ్రీదేవి తెలిపారు. ఆమె వెంట గ్రామస్తులు కిష్టయ్య, చరణ్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా సేవాలాల్‌ జయంతి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్న గుట్ట తండా, మౌలాలి తండా, కిసాన్‌ తండా గ్రామాల్లో శుక్రవారం సేవాలాల్‌ మహారాజ్‌ 280వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవలాల్‌ మహారాజ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు సేవా భావాన్ని పెంపొందించుకొని సేవలాల్‌ మహారాజ్‌ బాటలో పయనించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జాదవ్‌ గణేష్‌ నాయకులు యాదవరాజు, విజయ్‌, బాబు నాయక్‌ ,మురళి, సురేష్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

బైక్‌ దొంగల అరెస్టు

ముప్కాల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 14వ తేదీ ఉదయం ముప్కాల్‌ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గ్రామంలోని గాంధీచౌక్‌ వద్ద మూడు పల్సర్‌ బైక్‌లపై వెళ్తున్న వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారు. వీరిలో ప్రశాంత్‌- అంకాపూర్‌, సందీప్‌-భీమ్‌గల్‌, రాము- మెట్‌పల్లి, రఘు -మెట్‌పల్లి, నషీద్‌-అంకాపూర్‌, అజయ్‌-భీమ్‌గల్‌, చరణ్‌-భీమ్‌గల్‌ అని ముప్కాల్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు. వీరిని విచారించగా వారి వద్దనుంచి 24 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. వాహనాలు అంకాపూర్‌, భీమ్‌గల్‌, మెట్‌పల్లికి ...

Read More »

సవారె ఎలక్ట్రికల్‌ ఆటో విడుదల

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సవారె ఎలక్ట్రికల్‌ ఆటోను శుక్రవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మార్కెట్లో విడుదల చేశారు. నగరంలోని వినాయక్‌నగర్‌లోని మైక్రో మోబిలిటి సొల్యుషన్స్‌ ఆధ్వర్యంలో ఆటోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సమకూరడంతోపాటు పర్యావరణానికి ఇలాంటి ఆటోల వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లదన్నారు. పుల్‌చార్జింగ్‌ చేసిన తర్వాత వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందని, ముఖ్యంగా పర్యావరణ సమతుల్యానికి ఇలాంటి ఆటోలు ఎంతో దోహదపడతాయని ...

Read More »

ఘనంగా సేవాలాల్‌ జయంతి

బీర్కూర్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో బంజారా గురువు సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 280వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలో సేవాలాల్‌ మహరాజ్‌ ఆశీర్వదం ప్రతి ఒక్కరిపై ఉండాలనే గొప్ప ఆలోచనతో సంగం తండా వాసులు పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నసురేళ్లబాద్‌, బీర్కూర్‌ జడ్పీటీసీ సభ్యుడు కిషన్‌ నాయక్‌ హాజరై మాట్లాడారు. బంజారా జాతికి దిశ దశను నిర్దేశించిన యుగ పురుషుడు సేవాలాల్‌ మహరాజ్‌ 1739 ...

Read More »

గుండెపోటుతో ఏఎస్‌ఐ మృతి

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ పివిఎన్‌కె రాజు (55) గురువారం రాత్రి గుండెపోటుతో మతి చెందినట్లు సిఐ సుధాకర్‌ తెలిపారు. నియోజకవర్గంలోని సదాశివనగర్‌ మండలానికి చెందిన రాజు ఈనెల 12వ తేదీన ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. కాగా గురువారం రాత్రి విధులు నిర్వహించి స్టేషన్‌ పై అంతస్తులో పడుకున్న ఆయన రాత్రి గుండెపోటుతో మతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Read More »

ఋషివాక్కు

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వక్షో రక్షతి రక్షిత అన్నది ప్రసిద్ధ ధ్యేయ వాక్యం. వక్షాలను దేవతలుగా భావించటం భారతీయుల ఆచారం. ఒక రకంగా కతజ్ఞతకు చిహ్నం. ఈ శ్లోకంలో వక్షం ఒక గురువుగా కీర్తింపబడింది. శ్లో. ధత్తే భరం కుసుమపత్రఫలావలీనాం ఘర్మవ్యథామ్‌ మహతి శీతభవాం ఋజం చ| యో దేహమర్పయతి చాన్యసుఖస్య హేతో: తస్మై వదాన్యగురవే తరవే నమో2 స్తు|| పువ్వులు, ఆకులు, పండ్ల బరువును మోస్తూ, ఎండా, వానల బాధలు సహిస్తూ’ ఇతరులకు నీడ, ...

Read More »