Breaking News
అమరజవాన్లకు నివాళులు అర్పిస్తున్న బిజెపి నేతలు

అమరవీరులకు నివాళులు

కామారెడ్డి, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాశ్మీర్‌లో టెర్రరిస్టులు జరిపిన ఉగ్రదాడిలో చనిపోయిన వీర జవాన్లకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు.

అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ టెర్రరిస్టులను పెంచిపోషిస్తూ ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతుందని దుయ్యబట్టారు. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం సన్నద్దమవుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాదులు జరిపిన మారణ హోమాన్ని దేశ ప్రజలతో పాటు కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ తప్పవని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని, లౌకికవాదులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, రాజకీయాలను పక్కనబెట్టి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Students Rally

తాడ్వాయి మండల కేంద్రంలో అమరజవాన్లకు నివాళులు అర్పిస్తు కళాశాల, పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాద దాడిని ఖండిస్తు నినాదాలు చేశారు. అమర జవాన్లకు శ్రద్దాంజలి ఘటించారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *