Breaking News
రక్తదానం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్‌ నాయకుల రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ మహ్మద్‌ షబ్బీర్‌ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్‌ నాయకులు రక్తదానం చేశారు. జిల్లా అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావుతోపాటు కాంగ్రెస్‌ నాయకులు రక్తదానంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో సైనికులు మరణించినందున జన్మదిన వేడుకలను రద్దుచేసి సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పండ్ల రాజు, నిమ్మ దామోదర్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, విజయ్‌, రాజేశ్వర్‌, కారంగుల అశోక్‌రెడ్డి, అంజద్‌, జమీల్‌, మల్లేశ్‌ యాదవ్‌, రవిగౌడ్‌, కన్నయ్య, చాట్లరాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *