Breaking News
ఎంపిని సన్మానిస్తున్న మానస గణేశ్‌

ఎంపిని సన్మానించిన రజక సంఘం ప్రతినిధులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ పార్లమెంటెరియన్‌గా అవార్డ్‌ పొందిన ఎంపి కవితకి రజక సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మానస గణేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఎంపి అవార్డ్‌ పొందడం తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లా వాసులంధరికి కూడా గర్వకారణంగా ఉందని, క్రమశిక్షణ, ప్రజాసమస్యల పట్ల భాధ్యత, నిబద్ధత, మాటల్లో స్పష్టత, నిక్కచ్చితత్వం, పనులు నెరవేర్చే విషయములో పట్టుదల, సేవే పరమావధిగా పనిచేస్తున్న ప్రజా సేవకురాలికి ఉత్తమ పార్లమెంటెరియన్‌ అవార్డ్‌ రావడం ఆనందంగా ఉందన్నారు.

నిజామాబాద్‌ లోని రాజీవ్‌ గాంధి ఆడిటొరియములో జరిగిన కార్యక్రమములో ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, నగర మేయర్‌ సుజాతలు ఉన్నారు. అభినంధించిన వారిలో జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాంచందర్‌, పట్టణ అధ్యక్షుడు నారాయణ రావు, నియోజక వర్గ ఇన్ఛార్జి కనకరాజు, పట్టణ కార్యదర్శి శ్యాంసింగ్‌, గంగాధర్‌, జీవన్‌, ప్రవీణ్‌ నరేశ్‌ ఉన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *