Breaking News
సంస్మరణ సభలో మాట్లాడుతున్న ఆకుల పాపయ్య

రైతాంగ పోరాటాలను తీవ్రతరం చేస్తాం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ఉద్యమనేత, మండల నాయకుడు, అమరుడు, కామ్రేడ్‌ బుడ్డల సత్యం సంస్మరణ సభ శనివారం కోరటపల్లి గ్రామంలో అఖిలభారత రైతుకూలి సంఘం నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆకుల పాపయ్య మాట్లాడారు.

కామ్రేడ్‌ సత్యం రైతు కూలీ సంఘం ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించారని, భూమి పోరాటాల్లో ఆయన పాత్ర కీలకమైందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల ఫలితమే నేడు వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, వ్యవసాయంలో భూమి కీలకమైందని ఈ భూమి పేదల వద్ద కాకుండా సంపన్న వర్గాల చేతుల్లోకి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సభకు హాజరైన ప్రతినిదులు

భూమి సమస్య పరిష్కారం కాకుండా ఈ దేశంలో ఏ సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు. అందుకే భూమి నినాదంతో పనిచేస్తున్న రైతు కూలీ సంఘంలో పనిచేస్తు అమరుడైన కామ్రేడ్‌ సత్యం ఆశయాలను ముందుకు తీసుకు వెళ్దామని అదే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేల్పూర్‌ భూమయ్య, నాయక్వాడి నర్సయ్య, రూరల్‌ న్యూ డెమోక్రసీ కార్యదర్శి గంగాధర్‌, పివైఎల్‌ అధ్యక్షులు సాయినాథ్‌ విజయ్‌ నారాయణ, సత్యం భార్య రజిత, గంగాధర్‌, రాజేందర్‌, బాబు, సంతు, మాజీ సర్పంచ్‌ గుర్రం గంగాధర్‌, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Check Also

పరిశోధక విద్యార్థికి ‘కనెక్ట్ చాన్స్ ల‌ర్‌ పురస్కారం

డిచ్‌పల్లి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయంలోని ఉర్దూ విభాగానికి చెందిన పిహెచ్‌. డి. ...

Comment on the article