Breaking News
ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్దం చేస్తున్న సిపిఎం నాయకులు

ఉగ్రవాద దిష్టిబొమ్మ దగ్దం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమ్మూ కాశ్మీర్‌ లోని పుల్వామా జిల్లాలో దేశ రక్షణ కోసం కషి చేసే సైనికులపై ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో దాడి చేసి 49 మంది జవానులు వీరమరణం పొందటానికి కారణమైన ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ శనివారం ఉదయం నిజామాబాదు బస్టాండ్‌ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల చర్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు మాట్లాడుతూ ఉగ్రవాదులు దొంగచాటుగా సైనికులపై దాడి చేసి 49 మంది ప్రాణాలు బలిగొన్నారని ఇది పూర్తిగా దుశ్చర్య అని దేశ సరిహద్దులకు కాపలాగా ఉన్న సైనికులకు దేశ రక్షణ కొరకు పనిచేస్తున్న జవాన్లకు ఈ దేశంలోని పౌరులందరూ అండగా ఉంటారన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడుతారని పేర్కొన్నారు.

జమ్ము కాశ్మీర్‌లో కానీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కానీ ఉగ్రవాదం ప్రబలటానికి కారణాలను వెతికి వాటిని పరిష్కారం చేయకుండా ఉగ్రవాదాన్ని అణచాలనుకోవడం పొరపాటని, సంఘటనలు జరిగినప్పుడు కొద్దిరోజుల పాటు హడావుడి చేసి తర్వాత వాటి నివారణకు చర్యలు చేపట్టకపోవటం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, గంగాధరప్ప, నూర్జహాన్‌, మల్యాల గోవర్ధన్‌, సూరి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *