Breaking News
పాకిస్తాన్‌ జెండా తగలబెడుతున్న నేతలు

నేరుగా పోరాడే ధైర్యం పాకిస్థానీలకు లేదు

రెంజల్‌, ఫిబ్రవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాకిస్తాన్‌ కు భారతదేశంపై నేరుగా పోరాడే ధైర్యం లేక దొంగచాటుగా ఇలాంటి దాడులకు పాల్పడుతుందని పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరముందని బిజెపి మండల అధ్యక్షుడు మేక సంతోష్‌ అన్నారు. శనివారం సాటాపూర్‌ చౌరస్తాలో రెంజల్‌ మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో పాకిస్థాన్‌ జెండాను తగలబెట్టారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్య అని. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మ శాంతించాలన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు బుజ్జి, యోగేష్‌, మహిపాల్‌ రెడ్డి, నాగనాథ్‌, రూపేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *