Breaking News

మంత్రులు ఎవరు..? 19 తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు నిర్ణయం

స్పెషల్‌ కరస్పాండెంట్‌, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి తన నిర్ణయాన్ని తెలిపారు సిఎం. 19న మాఘశుద్ధ పౌర్ణమి మంచి ముహూర్తం కావడంతో ఆ రోజు ఉదయం పదకొండున్నర గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలుజారీచేశారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతమున్న సిఎం కెసిఆర్‌, హోంశాఖ మంత్రితో పాటు మరో నలుగురితో మంత్రివర్గ విస్తరణ చేస్తే ఈ సంఖ్య ఆరుగురికి చేరే అవకాశముంది. అలా కాకుండా మరో ఆరుగురిని మంత్రి వర్గంలోకి తీసుకుంటే మొత్తం ఎనిమిదిమందితో విస్తరణ జరగవచ్చని విశ్లేషకుల అంచనా. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో సిఎం కెసిఆర్‌కు సన్నిహితులైన కెటిఆర్‌, హరీష్‌రావులకు స్థానం లభించనుందా, వీరితో పాటు సీనియర్‌లందరిని పక్కనబెట్టి పూర్తి కొత్తవారికి మంత్రివర్గంలో చోటివ్వనున్నారా అనే ముచ్చట కూడా వినిపిస్తుంది.

ఒకవేళ కొందరు సీనియర్‌లు, మరికొందరు కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మంత్రివర్గంలో చోటుదక్కని మరికొందరు సీనియర్‌లు అలకబూనే ప్రమాదముంది. అలాగాకుండా పూర్తిగా కొత్తవారిని, యువతరాన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటే సీనియర్‌లందరిని సమానదృష్టితో చూసిన భావన, కొత్తవారికి అవకాశమిచ్చారనే భావన కలుగుతుంది.

ఏదేమైనా ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి స్థానం దక్కనుంది… ఎవరెవరు మంత్రివర్గంలో ఉండబోతున్నారు… అనే ఉత్కంఠ మాత్రం నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *