Breaking News
మృతి చెందిన ఆవును పరిశీలిస్తున్న అధికారులు

చిరుత దాడి…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామశివారులోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గుట్ట ప్రాంతంలో సోమవారం ఉదయం ధూసమడుగు వద్ద చిరుతపులి గోవును వేటాడి చంపింది. గత ఆరు నెలల్లో 11 ఆవులను చిరుత వేటాడడంతో గ్రామస్తులు, పశువుల కాపరులు భయాందోళన చెందుతున్నారు. చిరుత దాడిలో నీలం సత్తయ్యకు చెందిన 8 ఆవులు, దూడలు, పిట్ల లింగన్న, నీలం గంగవ్వ కు చెందిన గోవులను చంపి తిన్నట్టు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఫారెస్ట్‌ అధికారి భాస్కర్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చిరుతపులి సంచారం ఉందని, గ్రామస్థులు ముఖ్యంగా పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పశువుల యజమానులకు ప్రభుత్వం తరఫున పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట బీట్‌ ఆఫీసర్‌ సురేష్‌, ఆర్‌ఐ శివ చరణ్‌, పశువైద్యాధికారి జైపాల్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *