Breaking News
ప్రశాంత్‌రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న మానస గణేశ్‌

మంత్రికి మానస గణేశ్‌ అభినందనలు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ప్రశాంత్‌ రెడ్డికి హైదరాబాద్‌లోని ఆయన స్వగ హంలో రజక సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మానస గణేష్‌ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. రాజ్‌ భవన్‌లో ప్రశాంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూడడం అదష్టంగా భావిస్తున్నామన్నారు.

ప్రశాంత్‌ రెడ్డికి మంత్రి పదవి రావడం ప్రతిభకు దక్కిన పట్టంగా విధేయతకు దక్కిన గౌరవంగా, సమర్ధతకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇధి జిల్లా ప్రజలందరికీ కూడా గర్వంగా ఉందని పేర్కొన్నారు. గతములో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌గా పదవి భాధ్యతలు చేసిన ఆయనకు అనుభవం ఇప్పుడు మంత్రి పదవి భాధ్యతలు నిర్వర్థించడములో దోహద పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. విద్యా వంతుడు, కార్య ధీక్షాపరుడు సమర్థవంతుడైన నాయకుడికి సముచిత స్థానాన్ని కల్పించిన ముఖ్యమంత్రికి మానస గణేష్‌ ధన్యవాదములు తెలిపారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *