Breaking News
జిల్లా కలెక్టర్‌కు విరాళం అందిస్తున్న గ్రామస్తులు

గ్రామస్తుల విరాళం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుల్వామా అమరవీరుల సహాయార్థం సుబిర్యాల గ్రామస్తులు తమ విరాళాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుకు అందజేశారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాల సహాయార్థం ఆర్మూర్‌ మండలం సుబ్బిర్యాల గ్రామానికి చెందిన ప్రజలు 31 వేల 300 రూపాయలు విరాళానికి సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కు అందచేశారు. జిల్లా కలెక్టర్‌ను చాంబరులో కలిసి చెక్కు అందించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు రాంరెడ్డి, సాయిరెడ్డి, ముత్యంరెడ్డి, మోహన్‌రెడ్డి, అశ్విన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

వల‌స కార్మికుల‌కు మజ్జిగ పంపిణీ చేసిన పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్ మూలంగా కాలినడకన‌ తమ స్వస్థలాల‌కు వెళ్తున్న ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *