నిజామాబాద్, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు పురస్కరించుకొని మంగళవారం బిజెవైఎం నగర అధ్యక్షుడు రోషన్‌లాల్‌బోరా ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ హిందూ సమాజంకోసం శివాజీ చేసిన సేవలు ఎనలేనివని, యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి చైతన్య కులకర్ణి, నరేశ్, సాయి, ప్రతాప్, మహేశ్, సంజీవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఛత్రపతి శివాజీకి ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీహరి ఆచార్య, జగన్మోహన్గౌడ్లు మాట్లాడారు. శివాజీకి, నిజామాబాద్ జిల్లాకు అవినాభావ సంబంధం ఉందని, శివాజీ చారిత్రాత్మక గుర్తులు నేటికి ఉన్నాయని తెలిపారు. శివాజీ మహారాజ్ గురువు సమర్థరామదాసు సారంగాపూర్‌లోని హనుమాన్ ఆలయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. భారతమాత గర్వించదగ్గ పుత్రునిగా శివాజీ చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రాజ్‌కుమార్ సుబేదార్, మానిక్‌రాజ్, హరిప్రసాద్, చంద్రశేఖర్‌గౌడ్, ఆశనారాయణ, సంతోష్, దేవిదాస్ చాండక్, వసంత్‌రావు, నరేశ్‌కుమార్ తదితరులున్నారు.

Latest posts by Nizamabad News (see all)
- బిజెపి మండల అధ్యక్షునిగా ప్రదీప్‌కుమార్ - December 12, 2019
- జాతీయ సమ్మె జయప్రదం చేయండి - December 12, 2019
- రాష్ట్ర స్థాయి క్రీడలకు కామారెడ్డి వేదిక - December 12, 2019