Breaking News

Daily Archives: February 20, 2019

హమాలీ సంఘ సభ్యుల విరాళం

బీర్కూర్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు విరాళాలు అందించాలనే ఉద్దేశంతో బీర్కూర్‌ గ్రామ హమాలి సంఘం అధ్వర్యంలో బుధవారం గ్రామంలో విరాళాలు సేకరించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ జాతీయ నినాదాలతో అమరవీరుల త్యాగాలను తెలుపుతూ విరాళాలు సేకరించారు. ఈ సందర్బంగా హమాలీ సంఘం అధ్యక్షుడు భూమయ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన వీర సైనికుల గొప్పతనం ప్రజలకు తెలియచేస్తు వారి కుటుంబాలను ఆదుకొనే బాగంలో విరాళాలు సేకరిస్తున్నామన్నారు. ఇట్టి ...

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమిపూజ

రెంజల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సర్పంచ్‌ సునీత భూమిపూజ చేశారు. ఎంఎస్‌డిపి నిధుల ద్వారా మంజూరైన రూ.22.48000ల వ్యయంతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పనులలో గుత్తేదారు నాణ్యత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, మాజీ ఎంపిటిసిలు నర్సయ్య, శ్రీనివాస్‌, రైతు సమన్వయసమితి జిల్లా సభ్యుడు మౌలానా, రైతుసమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు దత్తుపటేల్‌, గ్రామస్థులు సాయరెడ్డి, హన్మంత్‌ రావ్‌, ...

Read More »

పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

రెంజల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో బుధవారం మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులను సర్పంచ్‌ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ పనులలో నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన పైప్‌లైన్‌ పనులను త్వరగా చేపట్టాలన్నారు. మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా, రైతుసమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు దత్తుపటేల్‌, గ్రామస్తులు సాయరెడ్డి, హన్మంత్‌రావ్‌, ...

Read More »

22న ”చింత బరిగె స్కీం”

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫరెవర్‌ ఫెంటాస్టిక్‌ థియేటర్స్‌, సూర్యాపేట వారి నాటిక ‘చింత బరిగె స్కీం’ ఈనెల 22న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ప్రదర్శించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నాటక రచన ఖాజా పాషా, దర్శకత్వం ఫరెవర్‌ థియెటర్స్‌, పర్యవేక్షణ దీన బాందవ అని పేర్కొన్నారు. ఇందూరు కవులు, కళాకారులు, రచయితలు, నాటక ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

Read More »