Breaking News

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద మంజూరైన రూ. 3 లక్షల 92 వేలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను 12 మంది లబ్దిదారులకు అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ విషయంలో చాలా అలసత్వం ఉండేదని తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ విషయంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎవరైనా బాధితులు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *