Breaking News
ప్రసంగిస్తున్న విజయ రహత్కర్‌

‘ఉజ్వల జ్యోతి’ మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది

కామారెడ్డి, ఫిబ్రవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ మహిళ మోర్చా కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం రామేశ్వరపల్లి గ్రామంలో

కమలజ్యోతి సంకల్ప కార్యక్రమం రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో మంగళవారం నిర్వహించటం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళ మోర్చా జాతీయ అధ్యక్షురాలు విజయ రహత్కర్‌, అతిధిగా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు విజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళ మోర్చా జాతీయ అధ్యక్షురాలు విజయ రహత్కర్‌ మాట్లాడుతూ గతంలో 70 ఏళ్ళు పాలించిన పాలకులు చేయని పనిని భారత మహిళల కోసం నాలుగున్నర సంవత్సరాల కాలంలో మోదీ చేశారని, స్వచ్చభారత్‌ కార్యక్రమంలో భాగంగా దేశంలోని మారుమూల గ్రామంలో కూడా మరుగుదొడ్లు మంజూరు చేయడం వలన చెంబు పద్దతి పోయి మహిళలు ఆత్మ గౌరవంగా బ్రతుకుతున్నారని పేర్కొన్నారు.

భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికలకు చదువు చేరువ చేశారన్నారు. ఉజ్వల జ్యోతి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా 6 కోట్ల మంది మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చిన ఘనత నరేంద్రమోడిదేనన్నారు. మహిళ సాదికారత కోసం 10 కోట్ల మంది మహిళలకు ముద్రలోన్‌ల రూపంలో రుణాలు ఇచ్చారని అన్నారు. స్వంత ఇంటి కల నెరవేరాలన్న పేద మహిళల కోసం ప్రధాన మంత్రి అవాస్‌ యోజన కార్యక్రమంలో 2 కోట్ల మందికి మోదీ ఇచ్చారని అన్నారు. ముస్లిం మహిళల కోసం ట్రిబుల్‌ తలాక్‌ బిల్లు తీసుకువచ్చి వారి కన్నీళ్లు తుడిచారన్నారు. మోదీ పాలనలో సబ్‌ కా సాత్‌- సబ్‌ కా వికాస్‌ పాలన ఉన్నదని అన్నారు.

మోదీ నిర్ణయం కారణంగా కాశ్మీర్‌లో జరిగిన పుల్వామా దాడులకు ప్రతీకారంగా మంగళవారం వైమానిక దాడులు చేసి 40 మంది సైనికులకు బదులుగా 400 పైగా ఉగ్రవాదులను మట్టి రిపించిన సంగతి అందరికీ తెలుసన్నారు. ఈ రోజు చేసే కమల జ్యోతి కార్యక్రమం ద్వారా 22 కోట్ల మంది లబ్ది దారుల ఇళ్లలో జ్యోతి వెలిగించి వారి ద్వారా మోదీ గారికి కతజ్ఞత తెలియజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ప్రతి మహిళ తమ చేతిలో కమలం పువ్వు గోరింటాకు వేసుకొని వచ్చి 2019 ఎన్నికల్లో మోదీని మళ్ళీ ప్రధానిగా చేయాలని ప్రతిన చేయాలని వివరించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అద్వర్యంలో 11 కోట్ల మంది కార్యకర్తలు మోదీ మరోసారి ప్రధాని కావాలని సైనికుల్లా పని చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు మోదీ కేటాయించారని అన్నారు. మహిళా లోకమంతా మోదీని ఆశీర్వదించి మన భవిష్యత్‌ తరాలకు మంచి పాలన అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *