Breaking News
నరేశ్‌ కుటుంబ సభ్యులతో జాగృతి నాయకులు

మలేషియాలో పడరాని కష్టాలుపడి ఎట్టకేలకు స్వగ్రామం చేరిన బాదితుడు

నిజామాబాద్‌ ప్రతినిధి, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జరిమానాతో పాటు, విమాన చార్జీలు చెల్లించి స్వదేశం చేర్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత

బాదితుడు నరేష్‌ను బుధవారం పరామర్శించిన జాగతి నాయకులు

ఎంపీ కవితకు జీవితాంతం రుణపడి ఉంటామన్న బాదితుడి కుటుంబ సభ్యులు

పొట్టకూటి కోసం మలేషియా వెళ్లి పడరాని కష్టాలు అనుభవించిన ఆ యువకుడు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు. ఎంపీ కల్వకుంట్ల కవిత సహాయంతో ఆ యువకుడికి విముక్తి లభించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌ కు చెందిన నగునూరి నరేష్‌ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణకోసం గతేడాది జూన్‌ నెలలో మలేషియా వెళ్లాడు. అతను వెళ్లింది టూరిస్టు వీసా కావడంతో, గడువు ముగియగా తిరిగి రావడానికి అవకాశం లేక అక్కడే ఉండి పోయాడు. గడువు దాటాక కూడా అక్కడే ఉన్నందున తనపై దాదాపు రూ.లు 60,000 జరిమానా ఉన్నట్టు తెలుసుకున్నా కట్టలేని పరిస్తితి. ఇటు తన స్వగ్రామంలోని కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఐనా నరేష్‌ ను స్వదేశం రప్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తే 18000 పోగైతే వాటిని మలేషియాలోని నరేష్‌ కు పంపారు. ఐనప్పటికీ చెల్లించ వలసిన జరిమానా ఎక్కువగా ఉండడంతో ఇండియా రాలేక కౌలాలంపూర్‌ లోని భారత హైకమీషన్‌ పునరావాస కేంద్రంలో రెండు నెలలు ఉన్నాడు.

మరోవైపు నరేష్‌ కుటుంబ సభ్యులు అతని పరిస్థితిని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు గారికి విన్నవించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు గారు ఈ విషయాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత గారి ద ష్టికి తేగా వెంటనే స్పందించిన కవిత గారు మలేషియా లోనీ భారత హైకమీషన్‌ అధికారులతో మాట్లాడారు. అలాగే నరేష్‌ పై ఉన్న పూర్తి జరిమానా చెల్లించారు. మలేషియా అధికారుల క్లియరెన్స్‌ ఇచ్చిన మీదట విమాన చార్జీలు కూడా చెల్లించి నరేష్‌ ను స్వదేశానికి చేర్చారు. ఇంటికి చేరుకన్న బాదితుడు నగునూరి నరేష్‌ ను ఎంపీ కవిత గారి ఆదేశాల మేరకు జాగ తి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, జిల్లా అధ్యక్షులు అమర్‌ దీప్‌ గౌడ్‌ లు నేడు జగిత్యాల జిల్లా అయిలాపూర్‌ లోని అతని ఇంటికి వెళ్ళి పరామర్శించారు.

ఈ సంధర్భంగా నరేష్‌ మాట్లాడుతూ ఏజెంట్‌ మాయమాటలు నమ్మి మలేషియా వెళ్లి చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. జరిమానా చెల్లించలేక రెండు నెలలు హైకమీషన్‌ హాస్టల్‌ లో ఉన్నానని అన్నాడు. నాణ్యమైన ఆహారం ఉండేది కాదని, ఇరుకు గదుల్లో ముప్పై నలభై మందిని ఉంచే వారని చెప్పాడు. చివరకు తనను జరిమానా, విమాన చార్జీలు చెల్లించి ఇండియా రప్పించిన ఎంపీ కల్వకుంట్ల కవితక్కకు జీవితాంతం రుణపడి వుంటానన్నాడు బాదితుడు నరేష్‌, అతడి తల్లి రాధ. తెలంగాణ జాగ తి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి మాట్లాడుతూ నరేష్‌ ను స్వదేశం చేర్చడానికి సహకరించిన సామాజిక కార్యకర్త శాంతిప్రియ గారికి, భారత హైకమీషన్‌ అధికారులకు క తజ్ఞతలు తెలిపారు. నరేష్‌ ను పరామర్శించిన వారిలో తెలంగాణ జాగ తి నాయకులు శ్రీనివాసరావు, మల్లేష్‌,యుగేందర్‌, జావిదు, సురేష్‌,కార్తిక్‌,గంగక్క మరియు స్థానిక సర్పంచ్‌ రాధ -సందయ్య, ఉపసర్పంచ్‌ అంజమ్మ నాయకులు నగ్గునురి గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *