Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు

28న బంద్‌…

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మార చంద్రమోహన్‌ మాట్లాడారు. రైతులు గత కొన్ని రోజులుగా పసుపు, ఎర్రజొన్నల మద్దతు ధర కోసం తమ సమస్యలను పరిష్కరించేందుకు మామిడిపల్లి చౌరస్తా వద్ద, జాతీయ రహదారిపై రాస్తారోకోలు, వంటా వార్పూ చేసి తమ నిరసన వ్యక్తం చేశారని అన్నారు. కాగా మంగళవారం ఉదయం నుండి రైతులు ఆందోళన బాట పట్టి చలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహించారన్నారు.

శాంతి యుతంగా పాదయాత్ర చేస్తున్న సమయంలో పోలీసులు జక్రాన్‌పల్లి రహదారిపై రైతులపై లాఠీఛార్జ్‌ చేసి అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆద్యర్యంలో ఆర్మూర్‌, బాల్కొండ, జక్రాన్‌పల్లి మండలాల వ్యాప్తంగా గురువారం బంద్‌ నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌సి సెల్‌ అద్యక్షులు పి.సి.భోజన్న, యిట్టెం జీవన్‌, ఆకుల రాజు, విజయ్‌, భగత్‌, గొర్తే దేవేందర్‌, మహమూద్‌ అలీ, మీసాల రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *