Breaking News
కరపత్రాల ఆవిష్కరిస్తున్న దృశ్యం

అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాల ఆవిష్కరణ

కామరెడ్డి, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్‌లో భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, విహెచ్‌పి జిల్లా కార్యదర్శి రవి, పట్టణ అధ్యక్షుడు బాపురెడ్డి, భజరంగ్‌ దళ్‌ జిల్లా సంయోజక్‌ మహేశ్‌లు మాట్లాడారు. పుల్వామాలో ఉగ్రవాద దాడిలో చనిపోయిన వీరసైనికులను స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ సభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

వారి త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు జరిగే సభకు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు విపుల్‌, నవీన్‌, సాయి కిరణ్‌, అమర్‌నాథ్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *