Breaking News
సన్మాన సభలో ప్రసంగిస్తున్న ఎంపి కవిత

ఎర్రజొన్న రైతులు ఆందోళన చెందవద్దు…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లు, భవనాలు, రవాణా, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి ఆత్మీయ సన్మానం ఘనంగా జరిగింది. బుధవారం నిజామాబాద్‌లోని శ్రావ్యగార్డెన్‌లో జరిగిన కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుఃఖం దాచుకోవాలంటారు అలాగే సంతోషాన్ని పంచుకోవాలంటారు…కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌, శాసన సభ వ్యవహారాలు మన జిల్లాకే వచ్చాయని, శాసన వ్యవస్థలను మనవాళ్ళే చూస్తుండటం మనకు గర్వ కారణం అన్నారు కవిత. దేశంలోనే బెస్ట్‌ స్పీకర్‌ గా సురేష్‌ రెడ్డి పేరు తెచ్చుకున్నారు…అలాగే బెస్ట్‌ మినిస్టర్‌గా ప్రశాంత్‌ రెడ్డి పేరు తెచ్చుకోవాలని ఆకాక్షించారు. మనం ఎన్నో సక్సెస్‌లు అందుకోవాలి. టీమ్‌గా పనిచేస్తున్నామని, సురేష్‌ రెడ్డి, ఆకుల లలిత కూడా వచ్చారని చెప్పారు ఎంపి కవిత.

ఉద్యమకారులుగా ప్రజాసమస్యలు తెలిసిన వాళ్ళమంతా ప్రజా ప్రతినిధులు అయ్యామని అన్నారు. కొందరు ఎర్రజొన్న రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 2008 నాటి ఎర్ర జొన్న బకాయిలను చెల్లించిన ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నారు. రైతుల కోసం ఆలోచిస్తున్న పార్టీ టిఆర్‌ఎస్‌ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఎర్రజొన్న రైతులు ఆందోళన చెందవద్దని మీ వెంటే మేమంతా ఉంటామని ఎంపీ కవిత అన్నారు. రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు, మార్కెటింగ్‌ సౌకర్యాలు, సాగునీటి పథకాలు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రైతులు రైతు బాంధవుడిగా భావిస్తున్నారన్నారు. మన రైతు బంధు పథకం యావత్‌ దేశమంతా అమలుకు కార్యాచరణ జరుగుతోందని, ప్రదాని నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వ తొలి విడత సాయం మొదలు పెట్టారని తెలిపారు. మా గురించి సీఎం ఆలోచిస్తారో లేదో కానీ రైతుల గురించి ఆలోచిస్తారనీ ఎంపి కవిత చెప్పారు.

మాజీ స్పీకర్‌ కె.ఆర్‌ సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్‌లో బతుకమ్మ వర్సెస్‌ దద్దమ్మ మధ్య మాత్రమే జరుగుతాయన్నారు. నిజామాబాద్‌ జిల్లా గురించి, రైతుల గురించి పార్లమెంట్‌లో మాట్లాడిన మొదటి ఎంపి కల్వకుంట్ల కవిత అని ఈ విషయం నాకు వ్యక్తిగతంగా, జిల్లా ప్రజలకూ సంతోషం కలుగుతోందన్నారు. బెస్ట్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా అవార్డు అందుకున్న కవిత న్యూజిలాండ్‌ ప్రధాని చేత బతుకమ్మ ఆడించిన విషయం మనకు గర్వకారణం అన్నారు. మళ్లీ ఎంపిగా కవిత గెలవడం నల్లేరు మీద నడక మాదిరి అన్నారు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపి కవితను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఎంపి కవిత జిల్లాకు కమాండర్‌ అయితే మంత్రి ప్రశాంత్‌రెడ్డి వైస్‌కమాండర్‌ అని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రశంసించారు. ఈ అభిమానం మరువలేనిది ఎంపి కవిత తనకు దగ్గరుండి చేయించిన ఆత్మీయ సన్మానం మరువలేనిదని అన్నారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి. ఇందల్వాయి టోల్‌ గేట్‌ నుంచి భారీ ర్యాలీగా తీసుకు వచ్చారని, వారి అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. 4 లక్షల భారీ మెజారిటీతో ఎంపి కవితను మళ్లీ ఎంపిగా గెల్పించుకుందాం అని సభలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ఎంపి కవిత, మంత్రి ప్రశాంత్‌ రెడ్డిలను గజమాలతో సత్కరించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి ఎంపి కవిత కరవాలాన్ని బహూకరించారు.

కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపి బిబి పాటిల్‌, మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు విజీ గౌడ్‌, రాజేశ్వర్‌ రావు, ఆకుల లలిత, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, హన్మంతు షిండే, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, మేయర్‌ ఆకుల సుజాత, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సుమనారెడ్డీ, నుడా చైర్మన్‌ ఆకుల సుజాత, టి ఎస్‌ రెడ్కో చైర్మన్‌ ఎస్‌. ఏ అలీం, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంకిషన్‌ రావు, ఈగ గంగారెడ్డి, ఏ ఎస్‌ పోశెట్టి సమావేశానికి హాజరై మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని సన్మానించారు.

Check Also

కాలుష్య కారకాలను నిర్మూలించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్జీటీ ఆదేశాల ప్రకారం కాలుష్య కారకాలను నిర్మూలించడానికి సంబంధిత ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *