Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న కైలాష్‌ శ్రీనివాస్‌రావు

జహీరాబాద్‌ ఎంపి అభ్యర్థిగా షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు అభ్యర్థిగా షబ్బీర్‌ అలీ పేరును నిర్ణయిస్తు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ తీర్మానం చేసింది. పార్టీ జిల్లా అద్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్టు జిల్లా అధ్యక్షుడు తెలిపారు. జహీరాబాద్‌ పరిధిలోగల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ మేరకు తీర్మానం చేసి అధిష్టానానికి పంపినట్టు తెలిపారు.

షబ్బీర్‌ అలీతోపాటు మరో ఐదుగురు పేర్లను అదిష్టానానికి పంపినట్టు తెలిపారు. నిజామాబాద్‌ ఎంపిగా షబ్బీర్‌ అలీనే బరిలో ఉంచాలని అక్కడి నాయకులు తీర్మానం చేసి పంపినట్టు పేర్కొన్నారు. అందరు షబ్బీర్‌ అలీ బరిలోఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *