Breaking News

Monthly Archives: March 2019

ఈవిఎంలతోనే నిజామాబాద్‌ పోలింగ్‌…

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్‌ ఎలా అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. బ్యాలెట్‌ పేపర్‌తోనా… ఈవిఎం యంత్రాలతో పోలింగ్‌ నిర్వహిస్తారా అనేది చర్చనీయాంశమైంది. కానీ చివరిగా కేంద్ర ఎన్నికల సంఘం ఈవిఎంల ద్వారానే పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల నాటికి ఈవిఎంలను సప్లై చేయాలని ఇసిఐఎల్‌ను ఆదేశించినట్టు సమాచారం. మొత్తం 26 వేల 850 బ్యాలెట్‌ యూనిట్లు, 2240 కంట్రోల్‌ యూనిట్లు, ...

Read More »

ఎంపి కవితకు మద్దతుగా పలు సంఘాల తీర్మానం

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు మద్ధతు తెలుపుతూ పలు సంఘాలు తీర్మాణాలు చేస్తున్నాయి. ఆదివారం నిజామాబాద్‌లోని ఎంపి కార్యాలయానికి వచ్చిన సంఘాల నేతలు ఎంపి కవితను కలిసి తమ మద్ధతు తెలిపారు. ఎంపికి మద్దతు తెలుపుతున్న సంఘాల ప్రతినిధులు సంఘం చేసిన తీర్మాణం కాపీలను అందజేశారు. తెలంగాణ ఎరుకల హక్కుల సాధన పోరాట సమితి, నగర మేరు సంఘం, మా చారిటబుల్‌ ట్రస్ట్‌, జిల్లా గోసంగి సంఘం, బాల్కొండ నియోజక వర్గంలోని వేల్పూర్‌ ...

Read More »

బూత్‌ కమిటీ మీటింగ్‌లతో ఎమ్మెల్యే బిజీ బిజీ

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ఆదివారం నగరంలోని 40, 43, 44, 47వ డివిజన్‌ల బూత్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రాజకీయ పాలన వలన ఇరవై ముప్పై సంవత్సరాల నుండి జరగలేని పనులు ఈ నాలుగున్నర సంవత్సరాలలో జరిగాయన్నారు. దుబ్బతో ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీది దీపాలు ఆధునీకరణ, రోడ్ల విస్తరణ వంటి పనులు తెరాసతోనే సాద్యపడ్డాయన్నారు. దుబ్బ ప్రాంతంలో ఐటి ...

Read More »

తిర్మన్‌పల్లి గ్రామ విభజన సమస్య పరిష్కరిస్తా

నిజామాబాద్‌, మార్చ్‌ 31 ఎంపి కవిత నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజక వర్గంలోని తిర్మన్‌పల్లి గ్రామ విభజన సమస్యను ఎన్నికల కోడ్‌ పూర్తయ్యాక పరిష్కరిస్తానని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత గ్రామస్తులకు హామీనిచ్చారు. ఆదివారం దర్పల్లిలో రోడ్‌ షోలో పాల్గొనేందుకు వెల్తున్న ఆమె తిర్మన్‌పల్లిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన క్రాంతి, వీరేశ్‌, చందు, దాసన్న తదితరులు ఇటీవల తనను కలిశారని కవిత తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికలను బహిష్కరించినా కూడా ఎమ్మార్వో స్పందించలేదని గ్రామస్తులు చెప్పారన్నారు. మీ ...

Read More »

తెరాసలోకి అరికెల అనుచరులు

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అనుచరులు ఎంపి కల్వకుంట్ల కవిత సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం నిజామాబాద్‌లోని ఎంపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రత్నాకర్‌ గౌడ్‌, సిర్ప కిరణ్‌, సంపత్‌, చింతకాయల రవి టిఆర్‌ఎస్‌లో చేరారు. నగరంలోని మొదటి డివిజన్‌కు చెందిన 200 మంది యువకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ ఎంపి కవిత గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే నిజామాబాద్‌లోని విజయ్‌ ఇంజనీరింగ్‌ కాలేజి యజమాని కాటిపెల్లి నరేందర్‌రెడ్డి నిజామాబాద్‌ ...

Read More »

సోమవారం తెరాస బహిరంగ సభ

నిజాంసాగర్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల సభ నిర్వహించనున్నట్టు సిడిసి చైర్మన్‌ దుర్గారెడ్డి మండల తెరాస పార్టీ అధ్యక్షుడు గైని విట్టల్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎంపి బి.బి.పాటిల్‌ను తెరాస ఎంపి అభ్యర్థిగా గెలిపించాలని కోరుతూ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సోమవారం అంగడి బజార్‌ (మార్కెట్‌) స్థలములో సభ ఏర్పాటు చేశామన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ ...

Read More »

కారు గుర్తుకే ఓటేద్దాం : బి.బి.పాటిల్‌ను గెలిపిద్దాం

బీర్కూర్‌, మార్చ్‌ 31 ద్రోణవల్లి సతీష్‌ నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 11 న నిర్వహించే లోక్‌సభ ఎన్నికల్లో తెరాస ఎంపిగా బి.బి.పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్పిటిసి ద్రోణవల్లి సతీష్‌ కోరారు. ఆదివారం బీర్కూర్‌ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి బి.బి.పాటిల్‌ను గెలిపించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. గ్రామంలోని ప్రధాన వీదుల గుండా ప్రచారం కొనసాగింది. కార్యక్రమంలో మండల తెరాస ...

Read More »

టిఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మగౌరవ పతాక

నిజామాబాద్‌, మార్చ్‌ 31 దర్పల్లి రోడ్‌ షోలో ఎంపి కవిత నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మగౌరవ పతాక అని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజక వర్గంలోని దర్పల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్‌ షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఎంపి కవితకు ఆహ్వానం పలికారు. మంగళహారతులు పట్టారు. బొట్టుపెట్టి ఆత్మీయతను ప్రదర్శించారు. లంబాడా మహిళలు తమ సంప్రదాయ వస్త్రాలను అందజేశారు. లంబాడాల వస్త్రాలంకరణలో ఎంపి ...

Read More »

కేసీఆర్‌కు దేశరాజకీయలు శాసించే బలమివ్వండి

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలోని వివేకానంద మఠంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టి.ఆర్‌.ఎస్‌.అభ్యర్థి బీ.బీ.పాటిల్‌ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ధఫెదర్‌ రాజు, పోచారం సురేందర్‌ రెడ్డి, పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read More »

పసుపు బోర్డు కోసం ఎంపి కవిత ఎనలేని కృషి

నిజామాబాద్‌, మార్చ్‌ 31 టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ సెక్రెటరీ సజన్‌ రెడ్డి నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీ కవిత పసుపు రైతులకోసం, పసుపు బోర్డ్‌ ఏర్పాటుకు తీవ్రంగా కషి చేశారని టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ సెక్రెటరీ సజన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. రామ్‌మాధవ్‌ బిజెపి అధికారంలోకి వస్తేనే పసుపు బోర్డ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. గతంలో అనేక సందర్భాల్లో హోమ్‌ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పసుపు బోర్డ్‌ ఏర్పాటు గురించి ...

Read More »

అభివృద్దిని కొనసాగించే అవకాశం ఇవ్వండి

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ఐదేళ్ల పదవి కాలంలో జహీరాబాద్‌ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించామని తిరిగి దాన్ని కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపి బి.బి.పాటిల్‌ ప్రజలను కోరారు. ఆదివారం ఆయన దోమకొండ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, తెరాస మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబుద్దీన్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వేలైను, ఇతర అభివృద్ది పనులు తన హయాంలో జరిగాయని, రాష్ట్ర ...

Read More »

నాణ్యతతో పనులు చేయాలి

బాన్సువాడ, మార్చ్‌ 31 శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ప్రయోజనం కోసం చేపట్టే అభివృద్ది పనులు నాణ్యతతో చేపట్టాలని, నాణ్యత లోపిస్తే సహించేది లేదని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం బాన్సువాడలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు. పాత బాన్సువాడలోని దాసరి కాలనీ, నదిగడ్డ కాలనీ, ఎస్‌సి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు, రెండు పడక గదుల ఇళ్ళు నిర్మాణ పనులను ...

Read More »

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునికి సన్మానం

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునిగా నియమితులైన కైలాస్‌ శ్రీనివాస్‌రావును ఆదివారం దోమకొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. మునిసిపల్‌ ఛైర్మన్‌గా, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రతినిధిగా, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షునిగా ఉండడం గర్వకారణమన్నారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నారాయణ, సిద్దిరాములు, వెంకటేశం, వెంకయ్య, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కాంగ్రెస్‌లో గిరిజన మోర్చా అధ్యక్షుని చేరిక

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గాంధారి మాజీ సర్పంచ్‌, బిజెపి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మోజిరాం నాయక్‌లు ఆదివారం మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ షబ్బీర్‌ అలీ ఆద్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీ అబ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపి స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తాహెర్‌బిన్‌ హందాన్‌, ...

Read More »

కేంద్రంలో యూపీఏ సర్కారు రావడం ఖాయం

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో యుపిఎ సర్కారు రావడం ఖాయమని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌ పేర్కొన్నారు. ఆదివారం బాల్కొండ మండల కేంద్రం, ముప్కాల్‌ ఫంక్షన్‌ హాల్‌లో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రజా ఆదరణ ఉన్న పార్టీ అని పార్టీలో ఎంతమంది వస్తున్నా పోతున్నా పార్టీ తన అస్తిత్వం కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తుందని మధుగౌడ్‌ అన్నారు. భారత దేశానికి ఎంతో మందిని ప్రధానమంత్రి అందించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీ అని అలాంటి పార్టీలో ...

Read More »

వెర్సటైల్‌ ద్విచక్ర వాహనం ఆవిష్కరణ

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా గాయత్రీ నగర్‌లోని శ్రీ చైతన్య హైస్కూల్‌ వద్ద ఆదివారం శ్రీ దుర్గా ఆటో కేర్‌ వారి ఆధ్వర్యంలో వెర్సటైల్‌ నూతన టు వీలర్‌ ఆవిష్కరించారు. బిగాల గణేష్‌ గుప్తా టు వీలర్‌ నడిపి చాలా బాగుందని, దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సైకిల్‌వల్ల కాలుష్యము లేకుండా, దీనిని వాడడం వల్ల ప్రమాదాలు కూడా జరగకుండా నివారించవచ్చని ఇటువంటి వాహనాలు ఫోర్‌ ...

Read More »

49వ డివిజన్‌లో బిజెపి ప్రచారం

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 49వ డివిజన్‌ లోని సుభాష్‌ నగర్‌ ప్రాంతంలో బిజెపి నగర ప్రధాన కార్యదర్శి స్వామి యాదవ్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. బిజెపి నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ను గెలిపించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజల కోసం ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి ఉజ్వల యోజన జన్ధన్‌ యోజన, పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేవలం నరేంద్ర మోడీదేనని స్వామి యాదవ్‌ ...

Read More »

కామారెడ్డిలో వాహనాల తనిఖీ

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనికీ ముమ్మరం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం ఎస్‌ఐ శ్వేత, ఎస్‌ఐఎస్‌యు గోవింద్‌ ఆధ్వర్యంలో వాహనాలు తనికీ చేపట్టారు. వాహనాల పత్రాలు, వాహనాల్లో తరలిస్తున్న సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకే ఎవరి దగ్గరినైనా డబ్బు ఉంచుకోవచ్చని, అంతకు మించి తరలిస్తే సీజ్‌ తప్పదని స్పష్టం చేశారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉంచుకోవాలని, నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

Read More »

తెలంగాణ పౌరుషాన్ని డిల్లీలో చాటాను

జగిత్యాల, మార్చ్‌ 30 కోరుట్ల రోడ్‌షో లలో ఎంపి కవిత నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటులో తెలంగాణ పౌరుషాన్ని డిల్లీలో చాటానని తెలిపారు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత. శనివారం రాత్రి కోరుట్ల టౌన్‌లో లక్ష్మీ థియేటర్‌, బుర్జు, వెంకటేశ్వర ధియేటర్‌ వద్ద జరిగిన రోడ్‌షోలలో ఆమె ప్రసంగించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేశానని తెలిపారు. ఎంపీగా మీరు గెలిపిస్తే నియోజకవర్గం పరిధిలో 15 వేల కోట్ల రూపాయల అభివద్ధి పనులను చేశానని చెప్పారు. ఎంపీగా నియోజకవర్గ ...

Read More »

అక్కడ కన్నతల్లికి అన్నం పెట్టనోడు…ఇక్కడ బంగారు గాజులు చేయిస్తడట

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నవీపేట బహిరంగ సభలో ఎంపి కవిత నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కన్నతల్లికి అన్నం పెట్టనోడు ఇక్కడ బంగారు గాజులు చేయిస్తడట…అట్లుంది ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారమని అన్నారు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత. శనివారం బోదన్‌ నియోజక వర్గంలోని నవీపేటలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. మన రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా వేయి రూపాయల పెన్షన్‌ ఇస్తున్నామని, ఇందులో కేంద్రం రెండు వందల రూపాయలను 4 లక్షల మందికి ఇస్తుందని, ఈ విషయాన్ని ...

Read More »