Breaking News

Daily Archives: March 1, 2019

వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం

రెంజల్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్‌ సవిత రాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సమతా లైఫ్‌ సైన్సెస్‌ వారి ఆధ్వర్యంలో కౌమార బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. శారీరక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విద్యార్థులకు అవసరమైన సలహాలను, సూచనలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. కౌమార బాలికలకు వచ్చే శారీరక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వైద్యులను సంప్రదించి ...

Read More »

ఇష్టపడి చదివితే విజయం వరిస్తుంది

రెంజల్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఇష్టపడి చదివినప్పుడే అనుకున్న విజయాన్ని సాధిస్తారని రెంజల్‌ ఎస్సై శంకర్‌ అన్నారు. శుక్రవారం కస్తూర్బా బాలికల పాఠశాలలో కీర్తన సొసైటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినిలకు పరీక్ష అట్టలు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తమ ప్రతిభ ఆధారంగానే సమాజంలో గొప్ప హోదా కలుగుతుందని విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు, విద్యను బోధించిన ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలని ఆయన అన్నారు. కీర్తన సొసైటీ అధ్యక్షులు ప్రణయ్‌రాజ్‌ మాట్లాడుతూ ...

Read More »

ఓటర్‌ నమోదు పై అవగాహన ర్యాలీ

రెంజల్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క దివ్యాంగులు ఓటరు నమోదు చేసుకోవాలని తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంగన్‌వాడి కార్యకర్తలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని నేటి నుండి 5వ తేదీ వరకు ఓటర్‌ నమోదు కోసం బీఎల్‌వోలు స్థానికంగా ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటారని వారి వద్ద నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ...

Read More »

బిఎల్‌ఓలు సమయపాలన పాటించాలి

ఆర్మూర్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా చేపట్టవలసిన చర్యల గురించి శుక్రవారం దివ్యాంగులు ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వేల్పూర్‌ ఉపతహసీల్దార్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ ఓటర్‌ జాబితాలో పేరు తొలగించే ముందు సంబంధిత వ్యక్తికి నోటీస్‌ జారీ చేసిన తర్వాత తొలగించాలని అన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను బూతు స్థాయిలో నిర్వహిస్తునందున బిఎల్‌ఓలు, సూపర్‌ వైజర్లు తప్పకుండా 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు జాబితా పరిశీలన చేసి ...

Read More »

సజావుగా ఇంటర్‌ పరీక్షలు

ఆర్మూర్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో శుక్రవారం జరుగుతున్న ఇంటర్‌ పరీక్షలు 3వ రోజు ప్రశాంతంగా జరిగినట్టు కళాశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ నర్సయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ మూడవ రోజు పరీక్షల్లో మొత్తం విద్యార్థులు 321 మంది కాగా 50 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా అధికారి ఒడ్దెన్న ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లు చేసి ఎటువంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Read More »

కాంతి హైస్కూల్లో వీడుకోలు వేడుక

ఆర్మూర్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో శుక్రవారం కాంతి హైస్కూల్లో వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పెర్కిట్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీతయ్య పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. చదువుపట్ల భయపడకుండా మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారెడ్డి మాట్లాడుతూ గొప్ప ఆశయాన్ని ఎంచుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించి పెట్టాలని అయన కోరారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ హిమరాణి, ప్రవీణ్‌రెడ్డి, మల్లేష్‌, నిఖిత రెడ్డి, ఉపాధ్యాయ ...

Read More »

ఎమ్మెల్యేకు సన్మానం

ఆర్మూర్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రజక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంటు మానస గణేష్‌ ఆధ్వర్యములో రాష్ట్ర కమీటి, రాష్ట్ర మహిళా కమీటిలు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేశారు. సన్మానించిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలయ్య, ఉపాధ్యక్షుడు రాములు, కోశాధికారి ఎం నర్సింగ్‌ రావు, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, ఉపాధ్యక్షురాలు రమాదేవి, గ్రేటర్‌ అధ్యక్షురాలు రాధ, మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లావణ్యలు ఉన్నారు. ఆర్మూర్‌లో మాడ్రన్‌ ధొభిఘాట్‌ మంజూరుకు కషి ...

Read More »