Breaking News
కస్తూర్బా విద్యార్థినిలకు పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేస్తున్న ఎస్సై శంకర్‌

ఇష్టపడి చదివితే విజయం వరిస్తుంది

రెంజల్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఇష్టపడి చదివినప్పుడే అనుకున్న విజయాన్ని సాధిస్తారని రెంజల్‌ ఎస్సై శంకర్‌ అన్నారు. శుక్రవారం కస్తూర్బా బాలికల పాఠశాలలో కీర్తన సొసైటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినిలకు పరీక్ష అట్టలు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తమ ప్రతిభ ఆధారంగానే సమాజంలో గొప్ప హోదా కలుగుతుందని విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు, విద్యను బోధించిన ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలని ఆయన అన్నారు.

కీర్తన సొసైటీ అధ్యక్షులు ప్రణయ్‌రాజ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఎల్లప్పుడు కీర్తన సొసైటీ ద్వారా తమవంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి మమత, టిఆర్‌ఎస్‌ నాయకులు రఫీక్‌ ఇతరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *