Breaking News
ఎమ్మెల్యేతో రజక సంఘం ప్రతినిధులు

ఎమ్మెల్యేకు సన్మానం

ఆర్మూర్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రజక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంటు మానస గణేష్‌ ఆధ్వర్యములో రాష్ట్ర కమీటి, రాష్ట్ర మహిళా కమీటిలు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేశారు. సన్మానించిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలయ్య, ఉపాధ్యక్షుడు రాములు, కోశాధికారి ఎం నర్సింగ్‌ రావు, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, ఉపాధ్యక్షురాలు రమాదేవి, గ్రేటర్‌ అధ్యక్షురాలు రాధ, మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లావణ్యలు ఉన్నారు.

ఆర్మూర్‌లో మాడ్రన్‌ ధొభిఘాట్‌ మంజూరుకు కషి చేసినందుకు ఐలమ్మ భవనానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కత్ఞతలు తెలిపారు. ఆర్మూర్‌లో ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఆర్మూర్‌ నియోజక వర్గంలో సుమారు 70 మంది రజకులకు 100% సబ్సిడి రుణాలు అందాయన్నారు. ఇంకా కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు 110 మంది రజకులు రుణాలకోసం ఎదురుచూస్తున్నారని, వారికి కూడా త్వరగా రుణాలు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించి రుణాల మంజూరుకు కషి చేస్తానని చెప్పారన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *