Breaking News
విద్యార్థినిలకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ సవితారాణి

వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం

రెంజల్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్‌ సవిత రాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సమతా లైఫ్‌ సైన్సెస్‌ వారి ఆధ్వర్యంలో కౌమార బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. శారీరక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విద్యార్థులకు అవసరమైన సలహాలను, సూచనలు అందించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ. కౌమార బాలికలకు వచ్చే శారీరక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వైద్యులను సంప్రదించి అవసరమైన సలహాలను సూచనలు పాటించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. గ్రామాల్లో మూఢనమ్మకాలను నమ్ముతారని సైన్స్‌ అభివద్ధి చెందుతున్నా మారుమూల గ్రామాల్లో మూఢనమ్మకాల ప్రభావం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందని, మూఢనమ్మకాలు నమ్మరాదని ఏమైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గణేష్‌ రావు, జూనియర్‌ సేల్స్‌ మేనేజర్‌ అరవింద్‌ దాస్‌, ఏరియా మేనేజర్‌ శివ, నరేష్‌, దీపక్‌ పాఠశాల ఉపాధ్యాయులు మమత, కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *